Site icon A2Z ADDA

ఆయన లేని లోటు తీరనిది.. బీఏ రాజుపై మహేష్ బాబు ఎమోషనల్

Mahesh babu BA Raju సినీ నిర్మాత, పీఆర్వో, సూపర్ హిట్ మాగజైన్ అధినేత స్వర్గీయ బీఏ రాజు ఘట్టమనేని అభిమాని అన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని అయిన బీఏ రాజు మహేష్ బాబుకు ఎంతో సన్నిహితులు. మహేష్ బాబుకు తన అత్యంత ఆప్తుడైన బీఏ రాజు మరణం విషాదాన్ని నింపింది. బీఏ రాజు మరణం పట్ల, ఆయనతో ఉన్న అనుబంధం గురించి మహేష్ బాబు తాజాగా గుర్తు చేసుకున్నాడు.

మహేష్ బాబు తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ఎపిసోడ్ నిన్న ప్రసారమైంది. ఇందులో భాగంగా మహేష్ బాబు తన ఆత్మీయుడైనా బీఏ రాజుని గుర్తు చేసుకున్నాడు. ఉత్తరాల రాజు అని ఆయన్ను పిలిచేవారు. నాన్న గారికి అభిమానుల నుంచి వచ్చే లెటర్స్‌కి ఆనర్స్ రాసేందుకు పద్మాలయ స్టూడియోలో చేరారు.

అప్పటి నుంచి ఆయన పేరు ఉత్తరాల రాజు అయింది. నేను చిన్న తనం నుంచి ఆయన్ను చూస్తూ పెరిగాను. ఆయన నాకు ఎంతో ప్రత్యేకం. ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది అంటూ బీఏ రాజు గురించి చెబుతూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు. నా సినిమాలన్నీ కూడా ఆయనే చేసేవారు అంటూ బీఏ రాజుతో ఉన్న అనుబంధాన్ని మహేష్ బాబు గుర్తు చేసుకున్నాడు.

Exit mobile version