Mahesh Babu – Allu Arjun పుష్ప సినిమా విడుదలైన సమయంలో ఎక్కువగా మహేష్ బాబు పేరు ట్రెండింగ్‌లోకి వచ్చిందన్న సంగతి తెలిసిందే. పుష్పకు మొదటి రోజు ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. ఇలాంటి స్క్రిప్ట్, కథను మహేష్ బాబు తిరస్కరించి మంచి పని చేశాడు.. తెలివంటే మహేష్ బాబుదేనని అందరూ మెచ్చుకున్నారు. కానీ పుష్ప సినిమా టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది.
హిందీలో అయితే బాలీవుడ్ స్టార్లకు కళ్లు చెదిరేలా కలెక్షన్లను రాబడుతోంది. దాదాపు 60 కోట్లకు పైగా రాబట్టేసింది. ఇంత వరకు ఏ తెలుగు హీరో కూడా కేవలం డబ్బింగ్ సినిమాతో ఈ రేంజ్‌లో వసూళ్లను రాబట్టలేదు. బాహుబలి సినిమా కథ వేరే అనుకోండి. కానీ బన్నీ పుష్ప దెబ్బకు బాలీవుడ్ బాక్సాఫీస్ కూడా షేక్అవుతోంది.
ఇక పుష్ప సినిమా ఇంతలా హిట్ అయిపోవడం, కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుండటంతో.. మహేష్ బాబు కూడా ఆశ్చర్యపోయినట్టున్నాడు. దెబ్బకు పుష్ప సినిమాను వీక్షించాడు. తన స్టైల్లో పుష్ప రివ్యూను ఇచ్చేశాడు. ఇందులో అల్లు అర్జున్, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్, మైత్రీ మూవీస్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.
.@ThisIsDSP what can I say.. you’re a rock star!! Congrats to the entire team of @MythriOfficial. Proud of you guys!
— Mahesh Babu (@urstrulyMahesh) January 4, 2022
పుష్పగా అల్లు అర్జున్ స్టన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.. ఒరిజినల్ అండ్ సెన్సేషనల్. స్టెల్లార్ పర్ఫామెన్స్.. సుకుమార్ సినిమాలంటే రా, రస్టిక్, హానెస్ట్‌గా ఉంటాయని మరోసారి నిరూపించాడు.. క్లాస్‌గా ఉంది.. దేవీ శ్రీ గురించి ఇంకేం చెప్పగలను.. ఆయనో రాక్ స్టార్.. మైత్రీ మూవీస్ టీంకు కంగ్రాట్స్. మీ అందరినీ చూస్తుంటే గర్వంగా ఉందని మహేష్ చెప్పుకొచ్చాడు.
అయితే రష్మిక మందాన్నను మహేష్ బాబు మరిచిపోయాడు. సినిమాను చూస్తే కచ్చితంగా రష్మిక మందాన్న గుర్తుండిపోతుంది. కానీ రష్మికను మాత్రం మహేష్ బాబు గుర్తించనేలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా చేసిన కో స్టార్ గురించి, శ్రీవల్లి పాత్రలో రష్మిక గురించి ఒక్క మాట కూడా మహేష్ బాబు చెప్పకుండా ఆమెను కించపరిచినట్టు అయింది.