Site icon A2Z ADDA

Mahesh Babu Knee Surgery : మహేష్ బాబుకు సర్జరీ.. అందోళనలో ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరోగ్యానికి సంబంధించి ప్రస్తుతం అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మహేష్ బాబు మోకాళికి సర్జరీ అయిందని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు సూచించారట. దీంతో అభిమానులు తెగ కంగారు పడిపోతోన్నారు. తమ అభిమాన హీరో మహేష్ బాబుకు ఏం జరిగిందంటూ అభిమానులు ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు.

సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మోకాలికి మైనర్ గాయమయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ వైద్యులను సంప్రదించగా.. మోకాలికి సర్జరీ అవసరమని సూచించినట్లు.. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అమెరికా పయనం కానున్నట్లు టాక్. సర్జరీ అనంతరం మహేష్ బాబు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట.

దీంతో సర్కారీ వారి పాట సినిమా షూటింగ్ కు రెండు నెలలు బ్రేక్ పడనున్నదట. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అంతేకాదు #GetWellSoonMaheshAnna అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు గాయానికి సంబంధించిన వార్తలు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి.

మహేష్ బాబుకి గతంలో కూడా మోకాలి నొప్పి గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే. 2014 నుంచి మోకాలి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అప్పుడు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు. అప్పుడే సర్జరీ కి వెళ్లక పోవడంతో ఇప్పుడు ఆ బాధ మరింత అధిగమయినట్లు సమాచారం. ఇక సర్కారివారి పాట సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది.మరి ఇప్పుడు ఏర్పడే ఈ గ్యాప్‌తో ఏమైనా వాయిదా పడుతుందా? లేదా? అన్నది చూడాలి.

Exit mobile version