Site icon A2Z ADDA

సరదా సరదాగా సాగిన ‘ధీర’.. మేకింగ్ వీడియో వైరల్

లక్ష్ చదలవాడ ప్రస్తుతం ‘ధీర’ అనే మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి.

The Ride of Dheera | Laksh Chadalavada | Soniya Bansal | Neha Pathan | VikranthSrinivas | STTV Films

ధీర గ్లింప్స్, టీజర్‌ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ జానర్ ఏంటి? ఎలా ఉండబోతోంది? అనే హింట్ ఇచ్చేశారు మేకర్లు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను వదిలారు. షూటింగ్ స్పాట్‌లో యూనిట్ ఎంత సరదాగా ఉందో.. ఎంత కష్టపడి చిత్రీకరణ చేశారో చూపించేలా వదిలిన ఈ మేకింగ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

ధీర మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Exit mobile version