Site icon A2Z ADDA

Kajal Aggarwal : గర్భవతిగా కాజల్.. ఫోటో షేర్ చేసిన చందమామ

Kajal Aggarwal prenatal కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోంది.. గర్భవతి అంటూ గత కొన్ని నెలలుగా రూమర్లు వస్తోన్నసంగతి తెలిసిందే. అయితే ఆ మధ్య ఓ నిర్మాత ఇదే విషయాన్ని అనధికారికంగా కన్ఫామ్ చేసేశాడు. ప్రెగ్నెంట్ అయినందుకే సినిమా నుంచి తప్పుకుందని చెప్పుకొచ్చాడు. అలా మొత్తానికి కాజల్ అగర్వాల్ మాత్రం తల్లి కాబోతోందనే వార్తలు ఎలాగోలా బయటకు వచ్చేశాయి.

వ్యక్తిగత జీవితంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది కాబట్టే.. సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. అందుకే నాగార్జున ప్రవీణ్ సత్తారు సినిమాల్లోంచి కాజల్ తప్పుకుంది. మరి కొన్ని ప్రాజెక్ట్‌లను కూడా వదిలేసింది. అయితే కాజల్ మాత్రం రకరకాల ఫోటోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కడా కూడా గర్భం దాల్చినట్టుగా కనిపించలేదు.

కానీ తాజాగా కాజల్ అగర్వాల్ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తాను గర్భవతిని అని చెప్పేసింది. గర్భం దాల్చిన సమయంలో ఎలాంటి వ్యాయాయం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఓ స్పెషలిస్ట్‌ను నియమించుకున్నట్టు చెప్పేసింది. ఈ క్రమంలో కాజల్ షేర్ చేసిన ఫోటోలో ఆమె గర్భం దాల్చినట్టుగా అందరికీ అర్థమవుతోంది.

నా prenatal జర్నీని ప్రారంభిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది అంటూ వీడియో కాల్‌లో తన డాక్టర్‌తో మాట్లాడుతున్న ఫోటోను కాజల్ షేర్ చేసింది. prenatal అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు, జాగ్రత్తలు, బిడ్డను కనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం. మొత్తానికి కాజల్ మాత్రం ఇలా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టేసింది.

Exit mobile version