Site icon A2Z ADDA

‘వార్ 2’ ట్విస్టులు మాత్రం రివీల్ చేయకండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

ఇండియన్ ఐకానిక్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో YRF (యశ్ రాజ్ ఫిల్మ్స్) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మాతగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘వార్ 2’. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మూవీని తెలుగులోకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ఆదివారం (ఆగస్ట్ 10) నాడు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ (War 2 Pre Release Event) నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR Speech) మాట్లాడుతూ.. ‘అభిమానులతో ఇలా కలిసి సెలెబ్రేట్ చేసుకునేలా చేసిన మా వంశీకి థాంక్స్. బాద్ షా ఫంక్షన్‌లో వరంగల్‌కు చెందిన అభిమాని చనిపోయారు. అప్పటి నుంచి ఇలా పబ్లిక్ ఫంక్షన్‌లకు కాస్త దూరంగా ఉంటూ వచ్చాను. నా 25 ఏళ్ల సినీ జర్నీని సెలెబ్రేట్ చేయాలని నన్ను ఫోర్స్ చేసిన వంశీకి, వంశీని ఫోర్స్ చేసిన అభిమానులకు థాంక్స్. ‘వార్ 2’ చేయడానికి ప్రధానం కారణం ఆదిత్య చోప్రా. ‘వార్ 2’ చేయాల్సిందే అని నన్ను వెంటపడిన ఆదిత్య చోప్రాకి థాంక్స్. అభిమానులు గర్వపడేలా చేస్తాను ఆదిత్య చోప్రా గారు నాకు భరోసానిచ్చారు. నన్ను ఇందులో భాగం చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ టీంకు థాంక్స్. ముంబైలో నన్ను ఎంతో కంఫర్ట్‌గా చూసుకున్న టీంకు థాంక్స్. మళ్లీ YRF టీంతో పని చేయాలని అనుకుంటున్నాను. ‘బ్రహ్మాస్త్ర’ ఈవెంట్‌కు నేను రావాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు ఆయన దర్శకుడిగా, నేను హీరోగా ఇక్కడకు వచ్చాం. ‘వార్ 2’ని అయాన్ మాత్రమే తెరకెక్కించగలడు అని ఆగస్ట్ 14న అందరికీ తెలుస్తుంది. ఎన్ని నిద్రలేని రాత్రులు అయాన్ గడిపారో నాకు తెలుసు. 2025లో ఓ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌గా అయాన్ నిలుస్తారు. ‘వార్ 2’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. 25 ఏళ్ల క్రితం ‘కహోనా ప్యార్ హై’లో హృతిక్ డ్యాన్స్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. మైకేల్ జాక్సన్ తప్పా ఎవ్వరు కనిపించని నాకు హృతిక్ కనిపించారు. ఇండియాలో ఫైనెస్ట్, రీప్లేస్ చేయలని యాక్టర్ హృతిక్ మాత్రమే. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్, అంకిత భావం ఉంటుంది. 25 ఏళ్ల తరువాత ఆయనతో కలిసి, ఆయనతో పాటుగా నటించాను. హృతిక్ రోషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ డ్యాన్సర్. అలాంటి ఆయన పక్కన డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరు బాగా చేశారన్న పోటీ కాదు ఇది. నేను గొప్ప డ్యాన్సర్ అని మీకు (అభిమానులు) అనిపిస్తుంది. మన కంటే కూడా డ్యాన్స్ చేసేవారున్నారు. నేను ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. నన్ను నేను ఆయనలో చూసుకున్నాను. 75 రోజులు ఆయనతో కలిసి పని చేశాను. మళ్లీ మళ్లీ ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. నేను సౌత్ నుంచి వచ్చాను. రాజమౌళి గారు ఆ హద్దుల్ని చెరిపేశారు. సౌత్ నుంచి వచ్చి నన్ను అంత బాగా చూసుకున్న హృతిక్ గారికి థాంక్స్. ‘వార్ 2’ మూమెంట్స్‌ని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ‘వార్ 2’ అనేది ఎన్టీఆర్ హిందీలోకి వెళ్తున్న చిత్రమే కాదు.. హృతిక్ గారు తెలుగులోకి వస్తున్న చిత్రం. అభిమానులంతా కూడా హృతిక్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నా కెరీర్ మొదలైంది. స్వర్గీయ రామోజీరావు గారు నన్ను పరిచయం చేశారు. అప్పుడు మా నాన్న గారు, అమ్మ గారు తప్పా ఇంకెవ్వరూ నా పక్కన లేరు. ఆధోని నుంచి ముజీబ్ అనే అభిమాని మొదటగా వచ్చారు. అలా మొదలైన నా జర్నీలో ఇప్పుడు ఇంత అభిమానులు దొరికారు. అభిమానుల నుంచి ఇంత ప్రేమ దొరకడం నా పూర్వ జన్మ సుకృతం. ఇన్నేళ్లలో నాతో ఎంతో మంది అభిమానులు కలిసి వస్తున్నారు. దీనంతటికి కారణమైన కీర్తి శేషులు మా తండ్రి హరికృష్ణ గారికి, మా అమ్మ శాలిని, మా అమ్మ లక్ష్మీ గారికి, మా అన్న కీర్తి శేషులు జానకీ రామ్, ఇంకో అన్న కళ్యాణ్ రామ్ గారికి ధన్యవాదాలు. ఈ జర్నీలో నన్ను ఆదరించి, ప్రేమించిన ప్రతీ దర్శక, నిర్మాతలకు శిరస్సువంచి పాదాభివందనాలు చేస్తున్నాను. 25 ఏళ్లు నన్ను ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులకు పాదాభివందనాలు. నా వెన్నంటే నడిచిన మిత్రులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ, నటరత్న, పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు. రత్నల్లాంటి ఇద్దరు పుత్రుల్ని ఇచ్చిన నా భార్య ప్రణతికి, పెద్ద కొడుకు అభయ్, చిన్న కొడుకు భార్గవ్‌కి నమస్కారాలు బాగుండదు కానీ హగ్స్ ఇస్తాను (నవ్వుతూ). ఒక తల్లికి పుట్టకపోయినా, నన్ను కడుపులో పెట్టుకుని, నా బాధలో పాలు పంచుకునే, ఆనందంలో ఆనందాన్ని పంచుకునే, నేను నా ఇంట్లో సుఖంగా పడుకున్నా.. అభిమానులకు ఎంత చేసినా, ఏం చేసినా రుణం తీర్చుకోలేను. కొడుకుగా మా నాన్న గారు జన్మను ఇచ్చినా.. నా ఈ జన్మ మాత్రం అభిమానులకే అంకితం. అభిమానుల ప్రేమే నాకు చాలు. అభిమానుల్ని గర్వపడేలా చేసేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో నా వెన్నంటే ఉన్న అభిమానులకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. దేవుడి ఆశీస్సులతో ఇంకొన్నేళ్లు మనం ఇలానే కలిసి ముందుకు వెళ్దాం. ‘వార్ 2’తో మళ్లీ అభిమానుల్ని రెండు కాలర్స్ ఎత్తుకునేలా చేస్తాను. ఎవ్వరెన్ని మాట్లాడుకున్నా సరే బొమ్మ అదిరిపోయింది. పండుగ చేసుకోండి.. ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. చాలా కష్టపడి ఈ మూవీని చేశాం. ఆ ట్విస్టుల్ని మాత్రం బయట పెట్టకండి. ‘వార్ 2’లో డ్యాన్సులు, ఫైట్స్ అదిరిపోయాయి. కావాల్సిన అన్ని అంశాలుంటాయి. ‘వార్ 2’ హిందీ సినిమా మాత్రమే కాదు.. తెలుగు సినిమా కూడా. ‘వార్ 2’ సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం’ అని అన్నారు.

హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. ‘తారక్ మీకు (అభిమానులు) అన్న.. నాకు తమ్ముడు.. మనమంతా ఓ కుటుంబం. అభిమానుల్ని ఇలా ఇక్కడ చూస్తుండటం ఆనందంగా ఉంది. ‘క్రిష్’ మూవీని ఇక్కడ షూట్ చేశాం. తెలుగు వాళ్లు నా మీద ఎంతో ప్రేమను చూపిస్తుంటారు. ‘వార్ 2’ రావడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. యుద్దానికి రెడీగా ఉన్నారా?.. తారక్, నేను సహ నటులుగా జర్నీని స్టార్ట్ చేశాం.. కానీ ఓ అన్నాతమ్ముడిలా మారిపోయాం. తారక్‌ను ఇప్పుడు ఎలా ప్రేమిస్తున్నారో.. ఎప్పటికీ అలానే ప్రేమిస్తూనే ఉండాలి.. మీ ప్రేమకు తారక్ అర్హుడు. నా 25 సినీ ప్రయాణంలో ‘వార్ 2’ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. కబీర్ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్, గొప్ప ప్రేమ లభించింది. ఈ పాత్రను పోషించడం నాకు ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ సారి మరింత ఇంటెన్స్, డ్రామా ఉంటుంది. తారక్ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో మరింత స్పెషల్‌గా మారింది. తారక్, నేను ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. ఎన్నో సార్లు గాయాలు కూడా అయ్యాయి. కానీ తారక్ కష్టం చూసి నేను మరింత ఎనర్జీతో పని చేశాను. అయాన్ విజన్ చూస్తే నాకు ఏదీ కూడా కష్టంగా, భారంగా అనిపించలేదు. ఈ రోజు ఇలా అభిమానుల ప్రేమను చూస్తే ‘వార్ 2’ కోసం మేం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని అనిపిస్తోంది. తారక్‌లో నన్ను నేను చూసుకున్నాను. సినిమాలో ఇండస్ట్రీకి మేం వచ్చి 25 ఏళ్లు అవుతోంది. ఆయన ఫస్ట్ టేక్ ఆర్టిస్ట్. ఆయన్నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. సెట్‌కు, షాట్‌కు వంద శాతం కాన్ఫిడెన్స్‌తో వెళ్లేవారు. ఆయన ఎప్పుడూ కూడా షాట్‌ను చెక్ చేయలేదు. నేను ఆయన నుంచి అది నేర్చుకున్నాను. తారక్ అద్భుతంగా వంట చేస్తారు. మేం మళ్లీ సినిమాలు చేస్తామో లేదో తెలీదు కానీ.. లైఫ్ లాంగ్ ఆయన చేసిన బిర్యానీని తింటూనే ఉంటాను. ఆగస్ట్ 14న మా ‘వార్ 2’ చిత్రం రాబోతోంది. చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నందమూరి తారక రామారావు గారితో నాది 25 ఏళ్ల ప్రయాణం. హృతిక్ గారు నటించిన ‘కహోనా ప్యార్ హై’ మూవీని చూసి థియేటర్లో చప్పట్లు కొట్టాను. అయాన్ తీసిన ‘యే దివానీ హై జవానీ’ మూవీని డజను సార్లు చూశాను. నాగవంశీ నా కుటుంబ సభ్యుడు. ఇలాంటి వారందరినీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. ‘మ్యాడ్’ ఈవెంట్లో ఇది దేవర నామ సంవత్సరం అని చెప్పాను. ఇప్పుడు ‘హృతిక్ రామారావు’ నామ సంవత్సరంగా ప్రకటిద్దాం. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాల్లేదు. 72 గంటల తరువాత ఈ మూవీని చూసి అందరం ఎంజాయ్ చేద్దాం. ‘వార్ 2’లో కేవలం ఫైట్స్ మాత్రమే ఉండవని అయాన్ స్పీచ్ తరువాత అర్థమైంది. కేవలం ఫైట్స్ కావాలని అనుకుంటే ఎన్టీఆర్ వరకు ఎందుకు వస్తారు?.. బంగారం ఉంటే నగ చేసుకుంటాం కానీ.. బీరువాలో పెట్టుకోం కదా?.. ఎన్టీఆర్ అంటేనే సిల్వర్ స్క్రీన్‌కు వన్నె తెచ్చేవాడు. అలాంటి ఎన్టీఆర్‌ను అయాన్ గట్టిగానే వాడుకుని ఉంటాడు. టైటిల్ చూస్తే ‘వార్ 2’ అని ఉంది.. కానీ హృతిక్, ఎన్టీఆర్ మాత్రం చాలా స్నేహంగా కనిపిస్తున్నారు. చూస్టుంటే ఎన్టీఆర్‌కు హృతిక్ చెడ్డవారు, హృతిక్‌కు ఎన్టీఆర్ చెడ్డవారు అన్నట్టుగా ఉంది. ఏది ఏమైనా సినిమా మాత్రం మంచిగా ఉంటుంది. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కూడా ఒకరు వింధ్య పర్వతం, హిమాలయ పర్వతంలా అనిపిస్తుంది. అలాంటి ఇద్దరిని పెట్టి సినిమా తీసిన అయాన్‌కు హ్యాట్సాఫ్. ట్రైలర్ చూస్తేనే మూవీ ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. వినాయక చవితి పండుగ కంటే వారం ముందే ‘వార్ 2’ రాబోతోంది. మా వంశీ, అయాన్, యశ్ రాజ్ ఫిల్మ్స్‌కి పెద్ద విజయం దక్కాలి. ఆగస్ట్ 14న ‘వార్ 2’ని అందరూ చూడండి’ అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. హృతిక్ సర్‌కి టాలీవుడ్‌లోకి వెల్కమ్. అయాన్ హ్యాట్రిక్ హిట్ ఇవ్వబోతోన్నారు. అక్షయ్ తీసిన ‘సయారా’ బ్లాక్ బస్టర్ అయింది. తారక్, హృతిక్ చేసిన పాట సరైన టైంలో వస్తుంది. అభిమానులు పేపర్లు రెడీ చేసుకుని పెట్టుకోండి. ఆగస్ట్ 14 కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘వార్ 2’ని చూస్తుంటే తారక్ అన్నని హిందీలోకి కాకుండా.. హృతిక్ గారిని తెలుగులోకి తీసుకు వస్తున్నట్టుగా ఉంది. ‘వార్ 2’లో తారక్ అన్నని చూసిన తరువాత ఏ తెలుగు డైరెక్టర్ కూడా ఇంత బాగా చూపించలేదే అని అభిమానులు అనుకుంటారు. ‘దేవర’ కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్స్‌ను అభిమానులు ఇవ్వాలి. హిందీలో డే వన్ నెట్ కంటే మనం ఎక్కువ ఇవ్వాలి. ఇక మీ (అభిమానులు) మీదే ‘వార్ 2’ని వదిలేస్తున్నాను. ‘వార్ 2’ సినిమా అద్భుతంగా వచ్చింది. ఏ ఒక్కరూ నిరాశ చెందరు. బాగా లేకపోతే నన్ను ఎలాగూ తిడతారు కదా.. ఈ సారి పదింతలు తిట్టండి. ‘వార్ 2’ చూసిన తరువాత అద్భుతమైన తెలుగు సినిమా చూశామనే ఫీలింగ్ రాకపోతే ఇంకోసారి మైక్ పట్టుకుని సినిమా చూడండని అడగను’ అని అన్నారు.

అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘హృతిక్ సర్, ఎన్టీఆర్ సర్‌లతో పని చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవం. ‘వార్ 2’ జర్నీలో భాగం అవ్వడం నా అదృష్టం. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు ఎన్టీఆర్ గారు గెస్ట్‌గా రావాల్సింది. ఇప్పుడు ఆయనతోనే మూవీని చేశాను. ఇదంతా కూడా విధి, ఫుల్ ఆఫ్ లైఫ్ సర్కిల్ అని నాకు అనిపిస్తుంది. ఇంత వరకు ఈ మూవీ సోల్ ఏంటి? అసలు కథ ఏంటి? అన్నది చూపించలేదు. ‘వార్ 2’ని చూసిన తరువాత అందరూ సర్ ప్రైజ్ అవుతారు. మేం హృతిక్ సర్, ఎన్టీఆర్ సర్‌లను తెరపై అద్భుతంగా చూపించాలని ఈ రెండేళ్లు మేం చాలా కష్టపడ్డాం. ఎంత ఒత్తిడిగా అనిపించినా ఈ మూవీ సోల్‌ని మిస్ అవ్వకుండా, ఎంతో ఎంటర్టైనింగ్‌గా చిత్రీకరించాం. ‘వార్’ చిత్రం నాకు ఎంతో ఇష్టం. హృతిక్ సర్ కోసం రెండు, మూడు సార్లు చూశాను. ఇక ‘వార్ 2’ మూవీని డైరెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఎంతో పెద్ద బాధ్యత నా మీద ఉందని అర్థమైంది. ‘వార్ 2’లో డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ సోల్ ఉంటుంది. ‘వార్’, ‘వార్ 2’ మధ్య ఉన్న తేడా ఆగస్ట్ 14న మీకు తెలుస్తుంది. ఇద్దరి హీరోల్ని అద్భుతంగా చూపించాం. ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్, హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టుగా ఉంటుంది. మూవీని చూసిన తరువాత ఎవరు గుడ్ గాయ్?, ఎవరు బ్యాడ్ గాయ్? అన్నది ఆడియెన్స్ చెబుతారు’ అని అన్నారు.

సహ నిర్మాత అక్షయ్ విద్హానీ మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ గారు, హృతిక్ గారు నటించిన ‘వార్ 2’ కోసం మేం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు అవుతున్నాయి. ఈ టైంలో ‘వార్ 2’ వస్తుండటం మరింత స్పెషల్‌గా మారింది. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ అద్భుతం చేశారు. ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు మరింతగా సంబరాలు చేసుకుంటారు. YRF స్పై యూనివర్స్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ ఫ్రాంచైజీ. ఈ క్రమంలో ‘వార్ 2’ అనేది ఆరో చిత్రం. అయాన్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం మేం అంతా కూడా ఎంతో కష్టపడ్డాం. ఆగస్ట్ 14న సినిమా చూసి ఆడియెన్స్ అంతా సర్ ప్రైజ్ అవుతారు. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కలిసి మాయ చేయబోతోన్నారు’ అని అన్నారు.

Exit mobile version