గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ‘జాతర’ చిత్రాన్ని నిర్మించారు. సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో థియేటర్ లో ఇటీవలే విడుదలై మంచి టాక్ తో సక్సెస్ ఫుల్ రెండు వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతర సినిమా టీం సక్సెస్ మీట్ జరుపుకుంది.
డైరెక్టర్ , హీరో సతీష్ బాబు రాటకొండ మాట్లాడుతూ, ” ఈ సినిమాని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి నటీనటులు, టెక్నిషియన్స్ సినిమా విజయానికి కారణం. నవంబర్ 8 న మా సినిమాతో పాటు ఇంకో పది సినిమాలు పైన రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులు మాకు అందించిన విజయం మాకు చాల ఆనందాన్ని ఇచ్చింది. నన్ను, నా కధని నమ్మి ఈ సినిమా ని ఈ రోజు సక్సెస్ మీట్ వరకు తీసుకొచ్చిన, నన్ను సపోర్ట్ చేసిన గల్లా మంజునాథ్ గారి సమర్పణలో మన ప్రొడ్యూసర్స్ అయినటువంటి రాధాకృష్ణ గారికి, ద్వారంపూడి శివ శంకర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను”.
ప్రొడ్యూసర్ ద్వారంపూడి శివ శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ” ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నిషియన్స్ కి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అందరు కొత్తవాళ్లని పెట్టి ఈ సినిమా తీసాము. చాల చిన్న సినిమా అయినప్పటికి, పెద్ద పెద్ద ఆక్టర్స్ ఉన్న సినిమాలతో పోటీ పడి సినిమాని మనం రిలీజ్ చేసాం. ఇంత చిన్న సినిమాకి అంత గుర్తింపు రావడం అంత ఈజీ కాదు. ఒక వారం పాటు ఎక్కడ ఆగకుండా మా జాతర సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడి రెండో వారంలోకి కూడా అడుగుపెట్టింది. ఇది మేము చాల గర్వంగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ వల్ల మాకు థియేటర్ లో రిలీజ్ కి చాలా ఈజీ అయింది. డిస్ట్రిబ్యూటర్లు ఇంకా ఎక్సిభిటర్లూ కూడా చాల పాజిటివ్ గా మా సినిమాని సపోర్ట్ చేసారు”.
విష్ణు గారు మాట్లాడుతూ, ” ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు నేను పల్లెటూరు, గ్రామా దేవత కాన్సెప్ట్ అన్నప్పుడే నేను ఈ సినిమాకి కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మన రూట్స్ ని మనం మర్చిపోము కదా, ఆ విషయం లో నాకు ఈ సబ్జెక్టు బాగా కనెక్ట్ అయింది. అయితే డైరెక్టర్ సతీష్ గారే హీరోగా ఎలా చేస్తారో అనుకున్నాను, కానీ ఈ సినిమాకి అతని నటన ప్లస్ అయింది. మిగతా టెక్నిషియన్స్ ,ఆర్టిస్టులు కూడా చాల బాగా పర్ఫార్మ్ చేసారు. ఈ సినిమా చేసినందుకు నేను చాల గర్వపడుతున్నాను”.
డైలాగ్ రైటర్ మాట్లాడుతూ, ” ఈ సినిమాలో నేను పని చేయడం నాకు హ్యాపీ అనిపించింది. నేను పది సంవత్సరాలుగా ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్నాను. ఫస్ట్ టైం నేను ఫుల్ పేమెంట్ ఈ సినిమా ద్వారా తీసుకున్నాను. అందుకు నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కి నేను ఎప్పుడు రుణ పడి ఉంటాను.ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీ కి రావాలి .. ఇక్కడే ఉండాలి అని కోరుకుంటున్నాను”.