Site icon A2Z ADDA

RC 15 : నెక్ట్స్ లెవెల్‌లో చూడబోతోన్నారు.. చెర్రీ డ్యాన్సులపై జానీ మాస్టర్ కామెంట్స్

జానీ మాస్టర్ ప్రస్తుతం సౌత్ మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రఫర్‌గా మారిపోయాడు. రౌడీ బేబీ, బుట్టబొమ్మ పాటలతో జానీ మాస్టర్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో జానీ మాస్టర్ డిమాండ్ బాగా పెరిగింది. భారీ చిత్రాలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. దళపతి విజయ్ సినిమాకు కొరియోగ్రఫీ చేశాడు. విజయ్ 65వ చిత్రం బీస్ట్‌‌కు అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేసేశాడట. ఇక కన్నడలో పునీత్ రాజ్ కుమార్‌తో జానీ మాస్టర్ ఎక్కువగా పని చేశాడు.

ఇటీవలె ఆయన మరణంతో జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. ఇక జానీ మాస్టర్‌కు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. జానీ మాస్టర్‌ను ఇంతలా ప్రోత్సహించిన వాడు రామ్ చరణ్. తన సినిమాలో ఎప్పుడూ కూడా జానీ మాస్టర్‌కు అవకాశం ఇస్తుంటాడు.అలా జానీ మాస్టర్ ఇప్పుడు శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల్లో బిజీగా మారిపోయాడు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేస్తున్నాడు.

ఏఆర్ రెహమాన్‌ను కాదని, తమన్‌తో సంగీతాన్ని కొట్టిస్తున్నాడు శంకర్. దానికి తగ్గట్టుగా జానీ మాస్టర్ అదిరిపోయే మూమెంట్స్ చేయిస్తున్నాడు.తాజాగా నేడు రామోజీ పిల్మ్ సిటీలో పాట షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్ జరిగాయట. ఈ మేరకు జానీ మాస్టర్ ఓ ఫోటోను షేర్ చేశాడు.

మరోసారి నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, నా హీరో రామ్ చరణ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది.. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. రిహార్సల్స్ ఎంతో బ్రహ్మాండంగా జరిగాయి. ఈ పాటలో మీరు రామ్ చరణ్‌ను మీరు నెక్ట్స్ లెవెల్‌లో చూడబోతోన్నారు.. సర్ ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్నాను అని జానీ మాస్టర్ అంచనాలు పెంచేశాడు.

Exit mobile version