Site icon A2Z ADDA

Intinti Gruhalakshmi Episode 462 : ఇంట్లో కోడళ్ల పోరు.. శ్రుతిపై అంకిత ద్వేషం

ఇంటింగి గృహలక్ష్మీ సీరియల్‌లో ఇప్పుడు తులసికి కొత్త సమస్యలు వచ్చేశాయి. కోడళ్లైన అంకిత, శ్రుతీలతో ఇళ్లు త్వరలోనే రెండు ముక్కలు అయ్యేలా కనిపిస్తోంది. ఇక అంకిత నాటకలు, శ్రుతీ మీద ఉన్న కోపం, అసహ్యం చూస్తుంటే ఇంట్లో ఎప్పుడోసారి భూకంపం వచ్చేలా ఉంది. అత్తయ్య తులసి బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలని శ్రుతీ పూజ చేస్తుంటే అంకిత వచ్చి నానా రచ్చ చేస్తుంది. అమ్మమ్మ సాయంతో శ్రుతీని పూజలోంచి మధ్యలోనే లేపేసింది. అంకిత పూజ చేసింది. అలా మొత్తంగా గృహలక్ష్మీ 462వ ఎపిసోడ్‌లో కోడళ్ల మధ్య ద్వేషం, గొడవలతో గడిచింది.

అక్టోబర్ 28న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో నందు, లాస్యలు తమ కొత్త కంపెనీ విషయాలు మాట్లాడుకుంటారు. జీకేను ఎలాగైన ఒప్పించి తమ కష్టాల్లోంచి బయటపడాలని అనుకుంటారు. కంపెనీలో ఉద్యోగం చేయడానికి ఎవ్వరూ రావడం లేదని లాస్యతో నందు చెప్పుకుంటాడు. కానీ తులసి మాత్రం ప్రయత్నం చేస్తుంటుంది. ఉద్యోగులని రప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది.

మొత్తానికి నందు, లాస్య, తులసీలు ఆఫీస్‌కు బయల్దేరుతారు. అదే సమయంలో హారతితో అంకిత వస్తుంది. నుమ్ తెచ్చావ్ ఏంటమ్మా అని తులసి అడుగుంది. పూజ మొదలుపెట్టింది శ్రుతే అయినా పూర్తి చేసింది నేను అని చెబుతుంది. కాస్త అనుమానంతోనే తులసి హారతి తీసుకుంటుంది. అలా అంకిత మార్కులు కొట్టేందుకు ప్రయత్నించింది. కానీ చివరకు లంచ్ బాక్స్ తీసుకొచ్చి శ్రుతీ మార్కులు కొట్టేసింది. కానీ ఆ లంచ్ బాక్స్ తీసుకురావడంతో ఎప్పటిలానే శ్రుతీ మీద నందు చిందులు తొక్కేశాడు.

ఇక తాతయ్య వచ్చి అంకితకు చురకలు అంటించాడు. పై పై నటనలు మనుషులకు దగ్గర చేయలేవని అంకితపై సెటైర్లు వేశాడు. నాకేం నటించాల్సిన అవసరం లేదు.. నేను నాలానే ఉంటాను.. ఇష్టమున్న వాళ్లు నాతో ఉంటారు లేదంటే లేదు అని అంకిత వెళ్లిపోయింది. ఇక పీకలదాక కోపంతో అంకిత శ్రుతీ మీద విరుచుకపడింది. కూరగాయలు కట్ చేస్తున్న శ్రుతీ వద్దకు వెల్లి అల్లకల్లోలం సృష్టించింది. అలా మొత్తానికి శ్రుతీ అంకిత మధ్య మాటల యుద్దం జరిగింది.

అత్తయ్య గారిని బాధ పెట్టకు.. నీ వల్ల ఇంట్లో ప్రశాంతతను చెడగొట్టకు అని అంకితను శ్రుతీ వేడుకుంది. ఏం చేయమంటే అది చేస్తాను అని శ్రుతీ కన్నీరు పెట్టుకుంది. అయితే నా పనులన్నీ కూడా నువ్వే చేయాలని కండీషన్ పెడుతుంది అంకిత. ఆ మాటలకు శ్రుతీ షాక్ అవుతుంది. చేయలేనప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతావ్ అని శ్రుతీని ఈసడించుకుంది అంకిత.

ఇక రేపటి ఎపిసోడ్‌లో నందు తన ఆఫీస్‌లో జరిగిన అవమానం గురించి ఇంట్లో చెప్పి తులసిని నిందించే ప్రయత్నం చేశాడు. ఇకపై రేపటి నుంచి ఆఫీస్‌కు రాను.. పెనాల్టీ కట్టలేక జైలుకే వెళ్తాను అని నందు తెగేసి చెప్పేశాడు. మొత్తానికి ఇంట్లో కోడళ్ల సమస్యలు, బయట ఆర్థిక సమస్యలతో తులసి సతమతమవుతోంది.

Exit mobile version