Site icon A2Z ADDA

White Paper : నా జీవితం అలాంటిదే!.. అభి అన్న వల్లే అంటూ హైపర్ ఆది ఎమోషనల్

Hyper Aadi-Adhire Abhi హైపర్ ఆది అనేవాడు ఇప్పుడు ఇలా ఉన్నాడంటే దానికి కారణం మాత్రం అదిరే అభి. ఒకప్పుడు యూట్యూబ్‌లో స్ఫూప్‌లు చేసుకుంటూ ఉండే ఆది టాలెంట్‌ను అభి గుర్తించాడు. ప్రోత్సహించాడు. ఫేస్ బుక్‌లో ఆది పెట్టిన మెసెజ్‌కు అభి స్పందించాడు. చాన్స్ ఇచ్చాడు. తన టీంలోకి తీసుకున్నాడు. ఎదిగేందుకు అవకాశం ఇచ్చాడు. అలా ఆది తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు.

ఆది ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటాడు. అదిరే అభి వల్లే ఇంత వరకు వచ్చాను అని ఏ స్టేజ్ మీద అయినా చెబుతాడు. తన గురు భక్తిని చాటుకుంటాడు. అలా ఆది తాజాగా మరోసారి అభి మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అభి ఇప్పుడు మరోసారి హీరోగా పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.వైట్ పేపర్ అంటూ అభి హీరోగా రాబోతోన్నాడు.

ఇది వరకు పాయింట్ బ్లాక్ అనే సినిమాలో హీరోగా నటించాడు. దర్శకత్వంలోనూ పట్టు సంపాదించుకున్నాడు. ఇలా అన్ని రంగాల్లోనూ అభి తన టాలెంట్‌ను చూపించుకుంటున్నాడు. అయితే ఈ వైట్ పేపర్ సినిమా ప్రమోషన్స్ కోసం జబర్దస్త్ టీం మొత్తం కదిలింది. మొన్న సాయంత్రం జరిగిన ఈ ఈవెంట్‌కు రోజా, ఆది, గెటప్ శ్రీను ఇలా అంరదూ గెస్టులుగా వచ్చారు.

ఆ ఈవెంట్‌లో ఆది మాట్లాడుతూ.. నా జీవితం కూడా వైట్ పేపర్ లాంటిది.. అభి అన్న అవకాశం ఇవ్వాలని అనుకున్నాను అందులో రాసుకున్నాను.. అభి అన్న అవకాశం ఇచ్చాడు.. నా జీవితం ఇలా మారిపోయింది.. అభి దగ్గర నేను చాలా రోజులు పనిచేశాను.. ఆయన మంచితనం, సాయం చేసే గుణం అందరూ నేర్చుకున్నారు.. మా జబర్దస్త్ షోలో ఉన్న వాళ్లంతా ఆ మంచి లక్షణాలు తీసుకుంటారు.. అని అభి గురించి ఆది గొప్పగా చెప్పాడు.

Exit mobile version