హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
