Site icon A2Z ADDA

హీరో రాజశేఖర్ ఇంట్లో విషాదం.. కన్నతండ్రి కన్నుమూత

హీరో రాజశేఖర్ ఇంట్లో విషాదం నెలకొంది. దీపావళి పండుగ సమయంలో రాజ శేఖర్ ఇంట్లో ఇలాంటి ఘటన జరిగింది. అనారోగ్యంతో రాజ శేఖర్ తండ్రి తుది శ్వాస విడిచారు. ఆయన తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) మరణించారు. గతకొంతకాలంగా చికిత్స పొందుతూ గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు

వరదరాజన్‌ గోపాల్ చెన్నై డీసీపీగా చేసి రిటైర్‌ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాజశేఖర్‌ ఆయనకు రెండో సంతానం. వరదరాజన్‌ భౌతికకాయాన్ని నేడు చెన్నై తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మరణ వార్తతో రాజశేఖర్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. అసలే రాజశేఖర్‌కు తల్లిదండ్రులంటే ప్రేమ, గౌరవాలు ఎక్కువ.

 

Exit mobile version