ఆదిత్య ఓం బందీ సినిమా గురించి ఎన్నో గొప్ప ప్రశంసలు వచ్చాయి. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై బందీ మూవీకి ప్రశంసలు దక్కాయి. ఒక్క పాత్రతోనే సినిమాను తీయడం, పర్యావరణం మీద అవగాహన కల్పించే సందేశాన్ని ఇవ్వడం వంటి అంశాలతో బందీ ప్రత్యేకంగా మారింది. ఈ మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
ఆదిత్య వర్మ (ఆదిత్య ఓం) ఓ పెద్ద లాయర్. ప్రేమానురాగాలు, బంధాలు అనేవీ ఏవీ కూడా ఉండవు. అలాంటి ఓ లాయర్.. కొంత మంది కార్పోరేట్ వ్యక్తుల తరుపున వాదించేందుకు ముందుకు వస్తాడు. ఓ అడివినే కాజేసే ఆ గ్రూపుకి ఆదిత్య వర్మ వత్తాసు పలుకుతాడు. దీంతో ఆదిత్య వర్మను కొంత మంది ఆ అడవిలోనే బందీగా పడేస్తారు. ఒంటరిగా ఆ అడవిలో ఆదిత్య ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఆదిత్య చివరకు మారుతాడా? పర్యావరణం, ప్రకృతి గొప్పదనం తెలుసుకుంటాడా? మనిషిలా మారుతాడా? లేదా? అన్నది మిగతా కథ.
బందీ ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. మంచి సందేశాన్ని ఇస్తూ తీసిన ఈ చిత్రం అందరినీ మెప్పించేలా ఉంటుంది. ప్రకృతి గొప్పదనం, పర్యావరణ పరిరక్షణ గురించి మంచి మెసెజ్ ఇస్తూ ఈ సినిమాను డైరెక్టర్ రఘు చక్కగా తీశాడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఒకే పాత్ర కావడంతో ఆడియెన్స్ కాస్త బోరింగ్‌గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది.
కానీ ఆ లోపాన్ని టెక్నికల్ టీం కాపాడేసింది. మ్యూజిక్ వర్క్ బాగుంది. సీన్‌కు, ఎమోషన్‌కు తగ్గట్టుగా ఆర్ఆర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాకు మేజర్ అస్సెట్ కెమెరా వర్క్. విజువల్స్, కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి సినిమానే అయినా, ఇలాంటి ఓ ప్రయోగాన్ని చేసేందుకు ముందుకు వచ్చిన నిర్మాతలకు గట్స్ చాలా ఎక్కువే అనిపిస్తోంది. టెక్నికల్‌గా బందీ అందరినీ ఆకట్టుకుంటుంది.
పర్పామెన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఈ సినిమాలో ఉండేది, కనిపించేది ఒక్క పాత్రే. సినిమా అంతా ఒక మొహంతోనే నడిపించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆదిత్య ఓం అద్భుతంగా నటించాడు. అతని నటనతో మనకు ఎక్కడా బోరింగ్ అనిపించదు. ఎక్స్ ప్రెషన్స్‌తోనే ఆడియెన్స్‌ను కట్టి పడేస్తాడు. ఆదిత్య ఓం ఎంతటి నటుడో ఈ ఒక్క సినిమా చూస్తేనే అర్థం అవుతోంది. అంతా తానై భుజాల మీద నడిపించాడు.
బందీ.. ఓ చక్కని సందేశాత్మక చిత్రం
రేటింగ్ 3