Site icon A2Z ADDA

హరి హర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ.. దెబ్బ కొట్టిన వీఎఫ్ఎక్స్

Hari Hara Veeramallu Twitter Review పవన్ కళ్యాణ్ విపరీతంగా ప్రచారం చేయడంతో చివరి నిమిషంలో హరి హర వీరమల్లు సినిమా మీద బజ్ ఎక్కువగా పెరిగగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్, మీడియాతో చిట్ చాట్ అంటూ పవన్ కళ్యాణ్ వరుసగా స్టేజ్ మీద సందడి చేశాడు. ఇక ఈ వీరమల్లు సినిమాని ఒక రోజు ముందుగానే ప్రీమియర్ చేశారు. జూలై 23న రాత్రి స్పెషల్‌గా షోలు వేశారు. మరి ఈ మూవీకి ఎలాంటి టాక్ వచ్చిందో ఓ సారి చూద్దాం.

వీరమల్లు సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. కొంతలో కొంత ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్‌ని కాస్తో కూస్తో చూడగలం, ప్రథమార్దంలోనే బాగా కనిపిస్తాడని అంటున్నారు. ఇక సెకండాఫ్ అయితే దారుణంగా ఉందని, చాలా బోరింగ్, ఏదో జొప్పించినట్టుగా ఉంటుందట. ఇక వీఎఫ్ఎక్స్ అయితే తేలిపోయిందట. ద్వితీయార్ధంలోనే పవన్ కళ్యాణ్‌ను అస్సలు చూడలేకపోతామని అంటున్నారు.

ఈ మూవీకి ఉన్న ఏకైక బలాలు.. పవన్ కళ్యాణ్, కీరవాణి అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంటుందట. ఇక కీరవాణి బీజీఎం అదిరిపోయిందట. కొన్ని చోట్ల యాక్షన్ బ్లాక్స్ బాగానే వర్కౌట్ అయ్యాయట. కానీ ఓవరాల్‌గా ఈ మూవీని చూసుకుంటే అవుట్ డేటెడ్ కథ, కథనంతో బోల్తా కొట్టేస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లుక్స్ విషయంలో వీఎఫ్ఎక్స్ మాత్రం దారుణంగా తేడా కొట్టేసిందని చెబుతున్నారు.

Exit mobile version