గుప్పెడంత మనసు సీరియల్ పేరుకు తగ్గట్టే కొనసాగుతుందో. గుప్పెడంత మనసులో మోయలేనంత ప్రేమను, ఆ ప్రేమ ఇచ్చే బాధను భరించడం ఎంత కష్టమో చూపిస్తోంది. వసుధార అంటే ఇష్టమున్నా కూడా బయటపెట్టలేడు రిషి. అలాగని వదిలేయనూ లేడు. రిషి అహం అడ్డు వస్తుంది. ఇగో ఆపేస్తుంది. అయితే జరిగేది శిరీష్ ఎంగేజ్మెంట్ మాత్రమే అని తెలియని రిషి తెగ ఫీలవుతున్నాడు. వసుధారను మాటలతో తన మనసులోని ఫీలింగ్స్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు.
గురవారం నాటి ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ 280, అక్టోబర్ 28న ప్రసారం కాబోతోయే గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి, వసుధార మాటలు అందరినీ కదిలిస్తాయి. నిన్నటి ఎపిసోడ్‌లో వసుధార తన ఫ్రెండ్ కలిసి మాట్లాడుకుంటూ అలా రావడం, రిషిక కనిపించడం, పెళ్లి, ప్రేమ అంటూ మాట్లాడుకుంటున్నారా? అంటూ క్లాసులు పీకడం, అంతలోనే జగతి మేడం రావడం.. మీ పిల్లలకుమీరు చెప్పండి అది మీ బాధ్యత.. జీవితం తెల్ల కాగితం.. ఏం రాసుకుంటే అదే ఉంటుందని సంబంధం లేని మ్యాటర్ చెప్పేశాడు రిషి. కానీ వసుధార పెళ్లి గురించి మాట్లాడుతున్నాను అని నేరుగా చెప్పలేకపోయాడు రిషి.
ఇక మహేంద్ర క్యాబిన్‌లోకి వెళ్లిన రిషి.. శిరీష్ పెళ్లి ప్రస్థావన తీశాడు. పెళ్లి పెద్దగా మారిపోయినట్టున్నారు.. అని సెటైర్లు వేశాడు. నిశ్చితార్థం గురించి కావాలని చెప్పి మరీ రిషిని రెచ్చగొట్టేందుకు తండ్రి మహేంద్ర ప్రయత్నించాడు. ఇక జగతి మేడం రావడంతో రిషి బయటకు వెళ్లాడు. అసలేమైంది అని అనడంతో.. కొన్ని చిక్కు ముడులు విప్పుతున్నాను అని మహేంద్ర చెబుతాడు. ఏమైనా చేయండి కానీ రిషి మాత్రం బాధపడకూడదు అని జగతి వేడుకుంటుంది.
ఆ తరువాత ఎగ్జామ్ హాల్‌లో వసుధార పెన్ను రాయకపోతే తన పెన్ను ఇస్తాడు రిషి. తిరిగి ఆ పెన్ను ఇచ్చేందుకు వసు పరిగెత్తుకుంటూ వస్తుంది. కారులో వెళ్లేందుకు రెడీగా ఉన్న రిషి.. వసును చూస్తాడు. ఆగుతాడు. ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావ్ అని అన్నాడు. మీ గుర్తులు, మీ మెమోరీస్ మీ దగ్గర ఉండటం మీకు ఇష్టం కదా? సర్ అని అంది. అంటే నా మెమోరీస్ నాకు తిరిగి ఇచ్చేస్తున్నావా? అని రిషి అన్నాడు. అలా ఎందుకు అనుకుంటారు సర్.. భద్రంగా జాగ్రత్తగా మీకు తిరిగి ఇస్తున్నాను అని అనుకోవచ్చు కదా? అని అంటుంది.
ఆ తరువాత బయట ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. శిరీష్ వసుధార పెళ్లి అనుకుని భ్రమలో ఉన్న రిషి దానికి సంబంధించిన ప్రశ్నలే అడుగుతాడు. నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని వసుని రిషి అడుగుతాడు. ఇందులో చెప్పడానికి అంత ఏముంది సర్ అని లైట్ తీసుకున్నట్టు చెబుతుంది. అదేంటి వసు పెళ్లి అని నేను ఇంత టెన్షన్ పడుతుంటే.. వసు మాత్రం అంత నార్మల్‌గా ఉంది.. నన్ను లైట్ తీసుకుంటుందా? అని రిషి తన మనసులో అనుకుంటాడు.
అన్ని విషయాలు చెప్పేదానికి కదా? శిరీష్ విషయం ఎందుకు దాచావ్ అని వసుని రిషి అడుగుతాడు. శిరీష్ చెప్పొద్దని అన్నాక నేను ఎలా చెబుతాను సర్.. అర్థం చేసుకోండి అని వసు చెబుతుంది. ఇక ప్రేమ పుట్టడానికి క్షణాలు చాలు అంటూ ప్రేమ డైలాగ్స్ చెబుతుంది. అలా మొత్తం మాటలు అయిపోయాక.. వెళ్లిపోతూ ఉంటే ఆ పెన్ను కింద పడిపోతుంది. అది చూసిన వసు.. ఆగండి సర్.. మీరు మీ పెన్నును పడేసుకున్నారు అని చెబుతుంది.
నేను ఈ మధ్యన చాలా పోగొట్టుకుంటున్నాను.. నేను పొగోట్టుకుంటున్న ప్రతీదాన్ని నువ్ తెచ్చివ్వలేవు కదా? అని అంటాడు రిషి. ఏం పోగొట్టుకుంటున్నారు సర్ అని తిరిగి ప్రశ్నించింది వసు. అలా ఆ ఇద్దరి మద్య సీన్ కట్ అవ్వడంతో జగతి మేడం వద్ద సీన్ ఓపెన్ అవుతుంది. బీరువా సర్దక చాలా రోజులు అవుతుందని తన వస్తువులను తీస్తుంది జగతి. అక్కడ ఓ ఉంగరాన్ని చూసి వసు ఇష్టపడుతుంది. వెంటనే దాన్ని వసు చేతికి తొడిగేస్తుంది జగతి. నీ మీదున్న ప్రేమకు కానుక, గుర్తుగా పెట్టుకో అని జగతి అంటుంది.
అలా ఎపిసోడ్ అయితే ముగుస్తుంది.కానీ రిషి మథనం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. వసుధార నిశ్చితార్థం జరుగుతుందని భ్రమపడ్డ రిషి.. ఊరు వదిలి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. మహేంద్ర వచ్చి అడిగినా కూడా తన మనసులోని బాధను బయటపెట్టలేదు. నీ మనసేంటో నీకైనా తెలుసా? అని రిషిని మహేంద్ర అడుగుతాడు. అది తెలుసుకునేందుకు వెళ్తున్నా? అని మహేంద్రను పట్టించుకోకుండా రిషి వెళ్తాడు. మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి.