Site icon A2Z ADDA

‘పరంపర’లో అలాంటి పాత్ర.. గృహలక్ష్మీ తులసి మరీ ఇంత నాటుగానా?

పరంపరం వెబ్ సిరీస్‌ హాట్ స్టార్‌లో అందుబాటులో ఉందన్న సంగతి తెలిసిందే. బాహుబలి నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున పరంపరను నిర్మించారు. జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్ ఇలా ఎన్నో పాత్రలు ఉన్నాయి. అయితే ఇందులో గృహలక్ష్మీ ఫేమ్ తులసి కూడా నటించింది. అయితే కస్తూరీని తులసిగా చూసిన ప్రేక్షకులకు పరంపరలో కస్తూరీని చూస్తే షాక్ అవుతారు.

గృహలక్ష్మీ సీరియల్‌లో పద్దతి, సంప్రదాయాలకు మారుపేరుగా తులసి నిలుస్తుంది. ఆ పాత్రలో కస్తూరీ శంకర్ చక్కగా ఒదిగిపోయారు. ప్రతీ తెలుగు మహిళకు ఆ పాత్ర కనెక్ట్ అవుతుంది. అందుకే తులసి పాత్రకు ఇప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. కస్తూరీ శంకర్‌ను ఇప్పుడు తులసిగానే అందరూ గుర్తిస్తున్నారు. వెండితెరపై ఎక్కుగా రాని గుర్తింపు ఇలా బుల్లితెరపై సీరియల్‌తో వచ్చింది.

అయితే పరంపర వెబ్ సిరీస్‌లో మాత్రం కస్తూరీ కాస్త బోల్డ్‌గానే నటించింది. ఆ కట్టూ బొట్టూ ఆ పాత్ర అన్నీ కూడా తులసికి వ్యతిరేకంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఓ సీన్‌లో అయితే అందరినీ రెచ్చగొట్టేలా ఉంటుంది. పడకగదికి రమ్మంటూ సిగ్నల్ ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది. దాంట్లో కస్తూరీ ఓ రేంజ్‌లో నటించింది. ఇందిర పాత్రలో కస్తూరీ శంకర్ అదరగొట్టేసింది.

కానీ ఇక్కడ తులసిని చూసి అలవాటు పడ్డ జనానికి అక్కడ ఇందిరగా నచ్చకపోవచ్చు. కానీ ఆ పాత్రకు కస్తూరీ శంకర్ న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. మొత్తానికి హాట్ స్టార్‌లో ఉన్న వెబ్ సిరీస్ ఇప్పుడు మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇక రెండో సీజన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోపీ, మోహన్ రావు, నాయుడు, సురేష్, జెన్నీ ఇలా అన్ని పాత్రలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి.

Exit mobile version