Dhanush Aishwarya Rajinikanth Divorce డధనుష్ ఐశ్వర్య విడాకుల వ్యవహారం కేవలం కోలీవుడ్‌లోనే కాదు అన్ని భాషల పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక ధనుష్ ఐశ్వర్యల అన్యోన్య దాంపత్యానికి తెరపడింది. మొత్తానికి తమ పద్దెనిమిదేళ్ల వివాహా బంధానికి ఇద్దరూ స్వస్తి పలికారు. ఇక ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మొత్తానికి ధనుష్ ఐశ్వర్యలు విడిపోవడం పక్కన పెడితే.. దానికి కారణాలు ఏమై ఉంటాయా.? అని అందరూ ఆలోచిస్తున్నారు.
ధనుష్‌కు ఏమైనా అఫైర్లున్నాయా? ధనుష్ ఓ హీరోయిన్‌తో మరింత చనువుగా ఉన్నాడా? అందుకే వ్యవహారం విడాకుల వరకు వెళ్లిందా? అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. సూపర్ స్టార్ ఫ్యామిలీకే ఇలా ఎందుకు జరుగుతోందంటూ అభిమానులు బాధపడుతున్నారు. రజినీకాంత్ అంటే ధనుష్‌కు ఇష్టం కదా? రజినీ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ధనుష్ బాగా చూసుకున్నాడు కదా? కానీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుని ఉంటాడని అంతా ఆలోచిస్తున్నారు.
మొత్తానికి ధనుష్ ఐశ్వర్యల విడాకుల వ్వవహారం మాత్రం అందరినీ కుదిపేస్తోంది. త్వరలోనే మరో జంట కూడా విడిపోయేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో ఈ ఘటన జరగబోతోన్నట్టు కనిపిస్తోంది. శ్రీజ కళ్యాణ్ దేవ్‌ల విడాకులు సైతం కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. కళ్యాణ్ పేరుని తన పేరులోంచి తీసేసింది శ్రీజ. శ్రీజ కొణిదెల అని పెట్టుకోవడంతో ఊహగానాల ఊపందుకున్నాయి.