Site icon A2Z ADDA

Dil Raju : కాలగర్భంలో కలిసిన ‘సీనయ్య’.. దిల్ రాజుకు ఎంత నష్టమంటే?

VV Vinayak Seenayya మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఒకప్పుడు వివి వినాయక్‌కు మంచి పేరు ఉండేది. ఆది, టాగూర్, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ వంటి సినిమాలతో ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా మంచి స్టార్డంను ఎంజాయ్ చేశాడు. అయితే రాను రాను వినాయక్ ఇమేజ్ డ్రాప్ అవుతూ వచ్చింది. అదుర్స్ సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ అనిపించాడు. ఇక ఖైదీ నెంబర్ 150తో మరోసారి ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

కానీ ఆ తరువాత డిజాస్టర్లను చవి చూశాడు. ఇక వినాయక్ దర్శకుడిగా పనైపోయిందని అంతా అనుకున్నారు. దిల్ రాజును దిల్ సినిమాతో నిర్మాతగా నిలబెట్టింది వినాయక్. దిల్ రాజు వినాయక్‌ల బంధం ఇప్పటిది కాదు. అయితే తనను నిర్మాతగా నిలబెట్టిన వినాయక్‌ను హీరో చేస్తాను అంటూ దిల్ రాజు ముందుకు వచ్చాడు. సీనయ్య అంటూ ఓ సినిమాను ప్రారంభించాడు దిల్ రాజు.

సీనయ్య సినిమా కోసం వినాయక్ చాలానే కష్టపడ్డాడు. ఎక్సర్‌సైజ్‌లు చేసిన బాడీని తగ్గించుకున్నాడు. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి కష్టాలే వచ్చాయి. ఈ సినిమాకు హీరోయిన్ దొరకలేదు. షూటింగ్‌లు వాయిదా పడుతూ వచ్చింది. ఓ యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే షూటింగ్ చేసినట్టున్నారు. అప్పట్లో వదిలిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ దారుణమైన ట్రోలింగ్‌కు గురయింది.

సీనయ్య సినిమా రషెస్ చూసిన దిల్ రాజు.. దెబ్బకు అవాక్కయ్యాడట. ఈ సినిమాను ఆపేయడమే బెటర్ అని ఫిక్స్ అయిపోయారట. అప్పటికే దాదాపు రూ. 25 లక్షలు ఖర్చు పెట్టారట. అయినా పర్లేదు సినిమాను ఇంతటితోనే ఆపేద్దామని నిర్ణయించుకున్నాడట. అందుకే వినాయక్ ఇప్పుడు హీరో కల మానేసి.. దర్శకుడిగానే ముందుకు సాగుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నాడు వినాయక్.

Exit mobile version