Ram Charan Shankar రామ్ చరణ్ శంకర్ సినిమా ప్రాజెక్ట్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అది సెన్సేషన్ అవుతోంది. RC 15 అంటూ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే రోజును విడుదల చేసిన పోస్టర్‌కు పెట్టిన ఖర్చు విని అందరూ షాక్ అయ్యారట. దాంతో ఓ చిన్న పాటి సినిమానే తీసేయోచ్చని అప్పట్లో సెటైర్లు వేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఒక్కో రోజుకే కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని వినికిడి.
ఆల్రెడీ ఓ షెడ్యూల్‌ను పూణెలో పూర్తి చేసేశారు. ఇంకో షెడ్యూల్ నడుస్తోంది. అయితే ఇప్పుడు కరోనాతో కాస్త ఆగినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. దాదాపు ఐదు వందల కోట్లకు ఈ చిత్రం బిజినెస్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. జీ సంస్థ ఈ సినిమాను దాదాపు 350 కోట్లు పెట్టి కొన్నట్టు తెలుస్తోంది.
రోజురోజుకూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు మరింత బజ్‌ను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ నటించబోతోన్నట్టు టాక్ వచ్చింది. అసలే రణ్ వీర్ సింగ్ శంకర్ కలిసి అపరిచితుడు సినిమాను హిందీలో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ బంధంతోనే రామ్ చరణ్ సినిమాలోనూ ఓ రోల్ పోషించేందుకు రెడీ అయ్యాడని టాక్.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. జపాన్‌లో ఓ సాంగ్‌ను షూట్ చేయబోతోన్నారట. కేవలం ఈ సాంగ్ కోసమే దాదాపు 25 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడట శంకర్. అసలే శంకర్ సినిమాల్లో ఒక్కో పాట ఒక్కో థీమ్‌లో ఉంటుంది. అలా పాట కోసమే 25 కోట్లు ఏంటి? అని అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారట. ఇంకా మున్ముందు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో చూడాలి.