Site icon A2Z ADDA

తగ్గేదే లే అంటోన్న భీమ్లా నాయక్!

భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి బరిలోంచి తప్పించాలని అందరూ తెగ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాధే శ్యామ్ సినిమా గురించి ఎవ్వడూ మాట్లాడటం లేదట. మధ్యలో వచ్చి పడిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదట. కానీ భీమ్లా నాయక్‌ను మాత్రం పోటీ నుంచి తప్పించాలని ఇండస్ట్రీ నుంచి ఒత్తిడి వస్తోందట. నిర్మాతలతో అందరూ సంప్రదింపులు జరుగుతున్నాయట. కానీ పవన్ కళ్యాణ్ ఏ మాత్రం తగ్గడం లేదుట.

ఫ్యాన్స్ సైతం బరిలోకి దిగాల్సిందే..వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదని అంటుంటారు. సర్కారు వారి పాట, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ ఇలా ముందే బెర్తులు కన్ఫామ్ చేసుకున్నాయి. ఇందులో సర్కారు వారి పాట సమ్మర్‌కు జంప్ అయింది. అది రాజమౌళితో ఉన్న సంబంధం.. తదుపరి చిత్రం ఆయన దర్శకత్వంలోనే చేయాల్సి ఉంది కాబట్టి అలా వెళ్లిపోయాడేమో. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అస్సలు తగ్గట్లేదట. ఇండస్ట్రీలోని పెద్దలందరూ అడుగుతున్నా నో అని చెబుతున్నాడట.

ఇండస్ట్రీ కోసం సినిమాను వాయిదా వేయాలని కోరుతున్నారట. ఏ ఇండస్ట్రీ కోసం చేయాలి.. వకీల్ సాబ్ సినిమాను అన్ని కష్టాలు పెడుతుంటే ఎవ్వరైనా మాట్లాడారా? ఎందుకు పోస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ప్రశ్న అట. అందుకే భీమ్లా నాయక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి బరిలోకి దించాల్సిందేనని ఫిక్స్ అయ్యారట. ముందుగా చెప్పిన తేదీ అంటే జనవరి 12నే రావాలని గట్టిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

Exit mobile version