Site icon A2Z ADDA

Sreeja Kalyan : కనిపించని కళ్యాణ్ దేవ్.. శ్రీజ కూతురి పోస్ట్‌తో కొత్త అనుమానాలు!

Sreeja Kalyan కళ్యాణ్ దేవ్, శ్రీజల మధ్య విబేధాలు, మనస్పర్థలు వచ్చాయని గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ విడిపోయారు.. విడాకులు తీసుకుంటున్నారు అని కొందరు గాసిప్పులు పుట్టించారు. కానీ పండుగకు కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోతో రూమర్లకు చెక్ పడ్డట్టు అయింది. ఇక మధ్యలో మళ్లీ ఇలాంటి గాలి వార్తలే వినిపించాయి.

శ్రీజ బర్త్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ కాస్త ఆలస్యంగా విషెస్ అందించాడు. దీంతో మళ్లీ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు మళ్లీ రూమర్లు రావడం ప్రారంభమయ్యాయి. మెగా సంక్రాంతి సెలెబ్రేషన్స్‌లో కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. అది పక్కన పెడితే.. తాజాగా శ్రీజ పెద్ద కూతురు నివృత్తి చేసిన పోస్ట్‌తో అనుమానాలకు దారి తీసింది.

నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు, నేను ప్రేమించే వ్యక్తులు అంటూ శ్రీజ, తన చెల్లి, తాను ఉన్న ఫోటోలను మాత్రమే నివృత్తి షేర్ చేసింది. ఇందులో కళ్యాణ్ దేవ్ ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో నెటిజన్లకు అనుమానాలు పుట్టుకొచ్చాయి. కళ్యాణ్ దేవ్ ఎక్కడా? అని ఓ నెటిజన్ అడిగాడు. దీంతో మరో నెటిజన్ స్పందించాడు. డైవర్స్ అయ్యాయ్ అని అనుకుంటా? అని కామెంట్ చేశాడు.

మొత్తానికి ఈ జంట మీద మరోసారి రూమర్లు రావడం ప్రారంభించాయి. దీనికి తగ్గట్టుగానే కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమాకు మెగా ఫ్యామిలీ అండగా నిలవలేదు. సూపర్ మచ్చి సినిమా సంక్రాంతికి విడుదలైందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆ సినిమాను మెగా ఫ్యామిలీ గాలికి వదిలేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ రూమర్లపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక సమంత మాదిరిగానే శ్రీజ కూడా తన ఇన్ స్టాలో పేరు మార్చుకుంది. ఇన్ని రోజులు భర్త పేరు కూడా అందులో ఉండేది. శ్రీజ కళ్యాణ్ అని ఇన్ స్టాలో ఉండేది. కానీ ఇప్పుడు కళ్యాణ్‌ను పక్కకు తప్పించింది. శ్రీజ కొణిదెల అని పెట్టుకుంది. ఆమె ఫ్రెండ్ లిస్ట్‌లో కూడా కళ్యాణ్ కనిపించడం లేదు. దీంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువ అవుతున్నాయి.

Exit mobile version