Site icon A2Z ADDA

Niharika Konidela : కళ్యాణ్ దేవ్‌ను పక్కన పెట్టేసిన నిహారిక!

Sreeja Kalyaan Dhev Divorce మెగా హీరోల జాబితా నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ దేవ్ పేరు దాదాపు చెరిగిపోయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరి ఖాతాలో కూడా కళ్యాణ్ దేవ్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపించడం లేదు. ఇంతకు ముందు శ్రీజ, నిహారిక, సుష్మిత వంటివారు తమ ఇన్ స్టాగ్రాం ఖాతాల్లో కళ్యాణ్ దేవ్‌ను ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ లిస్ట్‌లో కళ్యాణ్ దేవ్ పేరు కనిపించడం లేదు.

కళ్యాణ్ అనే పేరును తన పేరునుంచి తప్పించేసింది శ్రీజ. ఇది వరకు చిరు చిన్న కూతురు ఇన్ స్టా ఐడీ శ్రీజ కళ్యాణ్ అని కనిపించేది. కానీ ఇప్పుడు అది శ్రీజ కొణిదెలగా మారింది. దీంతో అందరిలో ఉన్ను అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది. అసలే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడాకులు తీసుకున్నారని, వేర్వేరుగా ఉంటున్నారనే రూమర్లు వస్తున్నాయి.

దీనికి తగ్గట్టే.. శ్రీజ తన పేరును మార్చేసింది. తన భర్తను అన్ ఫాలో చేసేసింది. దీంతో విడాకుల రూమర్లు మరింతగా వ్యాప్తి చెందాయి. అయితే కళ్యాణ్ దేవ్ మాత్రం శ్రీజను ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు. కళ్యాణ్ దేవ్ క్రిస్మస్ రోజు చివరి పోస్ట్ చేశాడు. మళ్లీ ఇంత వరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు. అయితే నిహారిక, సుష్మితలు కూడా కళ్యాణ్ దేవ్‌ను అన్ ఫాలో చేసినట్టు తెలుస్తోంది.

కళ్యాణ్ దేవ్, నిహారికలు ఇన్ స్టాగ్రాంలో చేసుకునే కామెంట్లతో క్లోజ్‌గా అనిపించేది. నవిష్క గురించి నిహారిక కామెంట్లు చేస్తూ ఉండేది. అందులో తన బావ గురించి కూడా చెప్పేది. అయితే ఇప్పుడు మాత్రం నిహారిక, సుష్మితలు కూడా కళ్యాణ్ దేవ్‌ను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా కూడా కళ్యాణ్ దేవ్‌ను వెలివేసినట్టు అనిపిస్తోంది.

Exit mobile version