Site icon A2Z ADDA

ఎక్స్ ట్రా ఇస్తే గానీ చేయనందట!.. నిధి అగర్వాల్ డిమాండ్ మామూలుగా లేదు

Nidhhi Agerwal నిధి అగర్వాల్ ప్రస్తుతం మంచి జోరు మీదుంది. ఆమె కనిపిస్తే చాలు కుర్రకారు పిచ్చెక్కి పోతారు. అయితే ప్రతీ ఈవెంట్‌లో నిధి పాప కోసం ఓ సైన్యం రెడీగా ఉంటుందట. ఆ అరేంజ్మెంట్లు కూడా నిధి దగ్గరుండి మరీ చూసుకుంటుందట. తన కోసం కుర్రాళ్లను రెడీ పెట్టుకుంటుందని టాక్. తన పేరు వినిపించడంతోనే హడావిడి చేయడం వారి పని అన్నమాట.

అయితే ఇప్పుడు నిధి అగర్వాల్ పేరు బాగానే వినిపిస్తోంది. అశోక్ గల్లా హీరో సినిమాలో నిధికి ప్రత్యేకంగా ఏమీ ఒరిగిందేమీ లేదు. పాటలకు, రెండు మూడు సీన్ల కోసమే అన్నట్టుగా నిధి పాత్ర ఉంటుంది. అయితే ఈసినిమా కోసం నిధి అగర్వాల్ ముందు యాభై లక్షలు తీసుకుందట. దాదాపు యాభై అరవై రోజులు డేట్లు ఇచ్చిందట. కానీ కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఆ డేట్లు అయిపోయాయట.

దాంతో ఓ పాట కోసం ఎక్స్ ట్రా డేట్లు కావాల్సి వచ్చిందట. ఆ సాంగ్ దాదాపు 20 రోజులు చిత్రీకరించాట. అయితే ఎక్స్ ట్రా డబ్బులు ఇస్తే గానీ రానని నిధి డిమాండ్ చేసిందట. అలా మొత్తానికి ఇంకో యాభై లక్షలు నిధికి ముట్టజెప్పారట. అలా మొత్తానికి నిధి అగర్వాల్‌కు హీరో సినిమా వల్ల కోటి రూపాయలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇంత చేసిన తరువాత చివరకు ఆ పాటను తీసుకెళ్లి ఎండ్ కార్డ్ టైటిల్స్ పడే సమయంలో వేసేశారట.

కథకు అడ్డం పడుతుందనే కారణంతో ఆ పాటను తీసుకెళ్లి చివర్లో పెట్టారట. ఆపాట కోసం దాదాపు రెండు కోట్లు ఖర్చు పెట్టారట. అలా ఈ సినిమా కోసం అనవసరపు ఖర్చు ఎక్కువే అయిందని టాక్. మొత్తంగా ఈ సినిమాకు ఇరవై కోట్ల వరకు ఖర్చు అయిందని సమాచారం.

Exit mobile version