సమంత ప్రస్తుతం విడాకుల వ్యవహారాన్ని పూర్తిగా మరిచిపోయినట్టు కనిపిస్తోంది. తన పెట్స్‌తో జాలీగా గడిపేస్తోంది. ఎప్పటిలానే తన వర్కవుట్లలో మునిగి తేలుతోంది. అయితే సమంతకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. అసలే సమంత ఇమేజ్ ఇప్పుడు తెలుగులో మారిపోయింది. భర్త నుంచి విడిపోయిన సమంతగా జనాలు చూస్తుంటారు. ఇంతకు ముందు అక్కినేని అనే పేరు ముందు ఉండటంతో సమంత ఇమేజ్ వేరేలా ఉండేది.
కానీ ఇప్పుడు కథ మారిపోయింది. అక్కినేని కోడలు అనే ట్యాగ్‌ను సమంత చెరిపేసుకుంది. నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత ఇప్పుడు వేరుగా ఉంటోంది. ఈ విడాకుల మీద రకరకాల కథనాలు వచ్చాయి. సమంతకు లేనిపోని సంబంధాలు అంటగట్టేశారు. ఆ రూమర్లపై సమంత తెగ హర్ట్ అయింది. మీడియా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందంటూ ఎమోషనల్ అయింది. అయితే సమంత మాత్రం ఇప్పుడు మళ్లీ తన రొటీన్ లైఫ్‌ను ప్రారంభించేందుకు రెడీ అయింది.
ఈ క్రమంలోనే దసరా నాడు రెండు సినిమాలను ఒకే సారి ప్రకటించింది. అవి రెండూ కూడా లేడీ ఓరియోంటెడ్ చిత్రాలనే తెలుస్తోంది. అందులోనూ అవి ద్విభాష చిత్రాలు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతోన్నాయి. అయితే సమంతకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. సమంత పక్కన నటించేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదట. హీరోలు దొరకడం లేదని తెలుస్తోంది. అసలే ఇప్పుడు సమంత ఇమేజ్ తెలుగులో బాగా లేదు. ఆమె సినిమాలు కూడా ఆడతాయో లేదో తెలీదు. ఇక ఇప్పుడు ఆమెకు హీరో కూడా దొరకడం లేదట. అయితే ఎవరో ఒకరిని దొరకపట్టాల్సిందే. మేకర్లు అదే పనిలో ఉన్నారట.