లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సిరి హనుమంత్ ప్రధాన పాత్రధారులు
హైదరాబాద్, 16, ఫిబ్రవరి 2023: ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో అపరిమితమైన, కొత్తదైన, వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే కామెడీ డ్రామా చిత్రం , అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి లాసర్ 2, బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నుంచి ‘గాలి వాన’, ‘రేసీ’, హల్ వరల్డ్ మా నీళ్ల ట్యాంక్, అహ నా పెళ్లంట, రీసెంట్గా ఏటీఎం వంటి ఒరిజినల్స్‌ను ప్రేక్షకులకు అందించింది జీ 5. తాజాగా ఇప్పుడు ‘పులి – మేక’ అనే మరో ఒరిజినల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది.
‘పులి – మేక’ థ్రిల్లింగ్ జోనర్లో రూపొందిన ఈ వెబ్ ఒరిజినల్ కోంస కోన ఫిల్మ్ కార్పొరేషన్‌తో జీ5 చేతులు కలిపింది. దీనికి సంబంధించిన ఎగ్జయిటింగ్ టీజర్ ఫిబ్రవరి 17న న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ చేతుల మీదుగా రిలీజ్ అవుతుంది. చరణ్ ఈ టీజర్‌ను డిజిటల్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
టాలీవుడ్లో పేరున్న రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చాలా ప్రెస్టీజియస్‌గా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన పంతం సినిమాను డైరెక్ట్ చేసిన కె.చక్రవర్తి రెడ్డి దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ సీరియల్ కిల్లర్ ఏకంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌నే టార్గెట్ చేస్తాడు. ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తుంటాడు. అప్పుడు కిల్లర్‌ను పట్టుకోవటానికి పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ప్రయత్నాలే ఒరిజినల్. ఇందులో జ్యోతిష్యం కూడా ఓ కీలకమైన అంశంగా మనకు కనిపిస్తుంది.
లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ అద్భుతమైన పాత్రల్లో నటించారు. హైదరాబాద్ నగరంలో పోలీసులను ఓ సీరియల్ కిల్లర్ వరుసగా చంపేస్తుంటాడు. అతన్ని పట్టుకోవటానికి ఓ ఫొరెన్సిక్ ఎక్స్‌పర్ట్‌తో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను రన్ చేస్తున్న మహిళా పోలీస్ ఆఫీసర్ ఏం చేసిందనేదే కథాంశం. కఠినమైన పరిస్థితులను టీమ్ ఫేస్ చేస్తున్నప్పుడు మరో వైపు మీడియా కూడా వారిపై ఒత్తిడిని పెంచేస్తుంది. విచారణలో వారు భయంకరమైన నిజాన్ని ఫేస్ చేస్తారు.
నటీనటులు:
ప్రభాకర్ శర్మగా ఆది సాయి కుమార్, కిరణ్ ప్రభగా లావణ్య త్రిపాఠి, అనురాగ్ నారాయణ్‌గా సుమన్, దివాకర్ శర్మగా గోపరాజు, రాజాగా కరుణాకర్ శర్మ, సిరిగా పల్లవి, శ్రీనివాస్‌గా పాండు రంగారావు, స్పందనగా పల్లవి శ్వేత నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం:
బ్యానర్స్: జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్
కన్విన్సిడ్, క్రియేటెడ్: కోన వెంకట్
దర్శకుడు : చక్రవర్తి రెడ్డి.కె
సినిమాటోగ్రఫీ: రామ్ కె.మహేష్
ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్
స్టోరి రైటర్స్: కోన వెంకట్, వెంకటేష్ కిలారు
కాస్ట్యూమ్స్: నీరజ కోన
పాటలు: శ్రీజో