Site icon A2Z ADDA

‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి’ లిరికల్ సాంగ్ రిలీజ్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా నుంచి ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Edhoti Chey Gurram Paapi Reddy Lyric - Gurram Paapi Reddy | Naresh Agastya,Faria A | Krishna Saurabh

‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ పాటకు సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ అందించగా, లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ ఎనర్జిటిక్ గా పాడారు. కృష్ణ సౌరభ్ ఆకట్టుకునే ట్యూన్ తో కంపోజ్ చేశారు. ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి, ఏరు దాటివేయ్, ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి, ఓ రూటు వేయ్ గుర్రం పాపిరెడ్డి, ఏక్ మార్ 1234 తుక్కడ, నింగినుంచి ఊడిపడ్డ వాడు ఎవ్వడు ఇక్కడ, మంకీ నుంచి వచ్చిన వాళ్లే కదా అందరు ఇక్కడ, నీరసించి నీరుగారి ఉండిపోకు ఎక్కడ..’ అంటూ మంచి బీట్ తో పాటు ర్యాప్ స్టైల్లో సాగుతుందీ పాట.

Exit mobile version