Site icon A2Z ADDA

Aevum Jagat Teaser : చిన్న చిత్రానికి దేవా కట్టా సాయం

చిన్న సినిమాలు ఈ మధ్య పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. కొత్త కాన్సెప్ట్‌లతో వస్తోన్న చిత్రాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చిన్న సినిమాలకు ఇండస్ట్రీలో మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేసేందుకు ఇండస్ట్రీలోని వారంతా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏవమ్ జగత్ అనే సినిమా టీజర్‌ను విడుదల చేసి దేవా కట్టా తన వంతు సాయం చేశాడు.

కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం “ఏవమ్ జగత్”. దినేష్ నర్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ని మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాలోని రాధాస్ లవ్ అనే సాంగ్ విడుదల కాగా ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది ఈ పాట. తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు దేవాకట్టా విడుదల చేశాడు.

Aevum Jagat Teaser | Dinesh Narra | Munirathnam Naidu N | Rajeswari N | Sivakumar | Madhura Audio

దర్శకుడు టీజర్ తోనే సినిమా పై క్యూరియాసిటీ పెంచాడు. డైలాగ్స్ తో ఒక్కసారిగా సినిమా రేంజ్ పెరిగిందని చెప్పాలి. టీజర్ లో వచ్చిన ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆలోచింపచేసేలా ఉంది. టీజర్ లోని డైలాగ్స్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా లోని డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటీనటులు కూడా ఎంతో ఇంటెన్స్ తో కూడిన నటన ను కనపరిచినట్లు టీజర్ ను బట్టి తెలుస్తుంది. దర్శకుడు నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఛాయాగ్రహణం చాలా బ్యూటీ ఫుల్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో అందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని విడుదల కు సిద్దం గా ఉంది .ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Exit mobile version