Site icon A2Z ADDA

ఈటీవి విన్‌లో ‘శర్మ అండ్ అంబానీ’ ట్రైలర్ రిలీజ్

ఈ మధ్యకాలంలో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్ తోడైతే ఆ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు శర్మ అండ్ అంబానీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న ఈటీవీ విన్ యాప్ లో ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మనమే రాజా అనే పాట ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో వన్ మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ గా నిలిచింది.

Sharma and Ambani Official Trailer | ETV WIN | Premieres April 11 (youtube.com)

 

ఇక తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ గనక పరిశీలిస్తే శర్మతో పాటు అంబానీల జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు శర్మ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే అతని స్నేహితుడు అంబానీ మాత్రం షూ క్లీన్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక గ్యాంగ్ కి సంబంధించిన డైమండ్స్ మిస్ కావడంతో వీరి జీవితాలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మరొకపక్క కోర్టులో ధన్య బాలకృష్ణ వాదిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఇక శర్మ అంబానీ జీవితాల్లో జరిగిన అనుకోని పరిస్థితులు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి అనేవి ట్రైలర్లు ఆసక్తికరంగా చూపించారు. ఇంకో మాటలో చెప్పాలంటే ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచేసింది అని చెప్పాలి. ఈ సినిమాని కార్తీక్ సాయి డైరెక్ట్ చేస్తుండగా అనిల్ పల్లాతో కలిసి భరత్ తిప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ని భరత్ తిప్పిరెడ్డితో కలిసి కార్తీక్ సాయి సిద్ధం చేయడం గమనార్హం. ఇక ఈ సినిమాలో మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మండలిక, యష్, రూపక్ మరియు హనుమంతరావు వంటి నటులు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి కె.ఎ.స్వామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, గౌతం రాజ్ నెరుసు ఎడిటర్. శశాంక్ ఆలమూరు – మహా చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version