Site icon A2Z ADDA

Pushpa Review : ఇంకా మైండ్‌లోంచి వెళ్లడం లేదట!.. సెన్సార్ సభ్యుడి కామెంట్స్

Pushpa Review ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పుష్ప ప్రభంజనం సృష్టించేందుకు రెడీగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పుష్ప సినిమా మూడు వేల థియేటర్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే పుష్ప మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప బుకింగ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఇక ఓవర్సీస్‌లో అయితే పుష్ప ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.

కేవలం ప్రీమియర్స్ బుకింగ్స్‌తోనే హాఫ్ మిలియన్ డాలర్లను కొల్లగొట్టేసింది. ఈ లెక్కన మొదటి రోజే మిలియన్ మార్క్ క్రాస్ చేసేలా ఉంది. బాలయ్య అఖండ సినిమాకు మిలియన్ మార్క్ దాటేందుకు పది రోజుల కంటే ఎక్కువ సమయం పట్టేసింది. కానీ బన్నీ మాత్రం ఒక్క రోజులోనే మిలియన్ డాలర్లను రాబట్టేట్టు కనిపిస్తోంది. తినబోయే ముందు రుచులెందుకు అన్నట్టుగా.. ఇప్పుడు పుష్ప రివ్యూ బయటకు వచ్చింది.

ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు ప్రతీసారి ఇచ్చే రివ్యూ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఆయన ఓవర్సీస్‌లో సెన్సార్ సభ్యుడు. దీంతో ముందుగానే సినిమాను వీక్షిస్తుంటాడు. దాంతో ప్రతీసారి సినిమాకు సంబంధించిన ట్వీట్లు వేస్తాడు. అలా ఆయనదే మొదటి రివ్యూ అవుతుంది. తాజాగా పుష్ప సినిమా మీద ఆయన చేసిన కామెంట్లు, ఇచ్చిన రివ్యూ అదిరిపోయింది.

అల్లు అర్జున్ పర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్, అదరగొట్టేశాడు.. లేచి నిల్చుని సెల్యూట్ కొట్టేలా ఉంది.. ఆయన అభిమానులకు ఇది పండుగ సమయం అంటూ నాలుగు రేటింగ్స్‌లను కూడా ఇచ్చేశాడు. ఇంకా మైండ్‌లోంచి అల్లు అర్జున్ వెళ్ళడం లేదు.. స్టిల్ థింకింగ్ అంటూ కామెంట్ చేశాడు. ఇక రష్మిక మందాన్న స్వాగ్, రేసీ స్టోరీ, స్క్రీన్ ప్లే, మాసీ యాక్షన్ స్టంట్స్, సమంత ఐటం సాంగ్ అన్నీ కూడా అదిరిపోయాయ్.. బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేయండని ఆయన ట్వీట్ వేశాడు.

ఇక టాలీవుడ్‌లో ఈ ఏడాది ది బెస్ట్ సినిమా అవుతుందని అన్నాడు. బన్నీ కెరీర్ పరంగా ఇది ఆల్ టైం హిట్ అవుతుందని, పర్సనల్‌గా ప్రొఫెషనల్‌గా ఇది టర్నింగ్ పాయింట్ అని ఉమైర్ సంధు అభిప్రాయపడ్డాడు. మొత్తానికి ఉమైర్ సంధు రివ్యూ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version