Bangarraju Movie Twitter Review కింగ్ నాగ్ తన తనయుడు నాగ చైతన్యతో కలిసి సందడి చేసేందుకు బంగార్రాజు సినిమాతో బరిలోకి దిగాడు. సంక్రాంతి పండుగకు ఎలాగైనా రావాల్సిందేనని పట్టుబట్టాడు. మొత్తానికి నాగ్ తన పంతాన్ని నిజం చేసుకున్నాడు. బంగార్రాజు సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే ట్విట్టర్‌లో మాత్రం బంగార్రాజు మీద మిక్స్డ్ టాక్ వచ్చేసింది.
#Bangarraju is a utter scrap film. Nearly we can say a B Grade movie. Worst acting performance by team and direction.
— Hanu (@HanuViewws) January 14, 2022
బంగార్రాజు సినిమా మీద నెట్టింట్లో చర్చ బాగానే జరుగుతోంది. అభిమానులు సినిమా బాగుందని అంటే.. ఆంటీ ఫ్యాన్స్ సినిమాను చీల్చి చెండాడుతున్నారు. సినిమా సూపరో సూపర్ అని కొంత మంది అంటున్నారు. మరి కొందరు అయితే బీ గ్రేడ్, రాడ్ సినిమా అని ఏకిపారేస్తున్నారు. అనవసరమైన నెగెటివిటీ ఎందుకు అని న్యూట్రల్ సినీ లవర్స్ అంటున్నారు.
Hearing positive reviews
Interval nunchi climax varaku verel level ramp anta#Bangarraju pic.twitter.com/LDtK9IOrg0 — Tom Bhayya
(@Tom_Bhayya_Here) January 14, 2022
అయితే సినిమా ఎలా ఉన్నా కూడా నాగ చైతన్య పర్ఫామెన్స్ మాత్రం అదిరిపోయిందని కొందరు అంటున్నారు. బంగార్రాజు మాత్రం నిజంగానే పండుగ లాంటి సినిమా అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అక్కినేని అభిమానులకు మాత్రం ఈ సినిమా కన్నుల పండువగా ఉండేట్టు కనిపిస్తోంది. అయితే మిక్స్డ్ టాక్ వల్ల సినిమా సంగతి ఏంటన్నది క్లారిటీ రావడం లేదు.
ఇంకొన్ని గంటలు అయితే బంగార్రాజు పూర్తి రివ్యూ వస్తుంది. అప్పుడు నాగ్, చైల భవిష్యత్తు ఏంటన్నది అర్థమవుతుంది. బంగ్రారాజు బ్లాక్ బస్టరా? డిజాస్టరా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.