ఓ అభిమాని తన హీరోను ఎలా చూడాలి.. ఎలా చూస్తే నచ్చుతుందో తెలుస్తుంది. అలాంటి ఓ వీరాభిమాని దర్శకుడిగా మారి.. తన ఆరాధ్య దైవాన్ని డైరెక్ట్ చేస్తుంటే ఎలా ఉంటుందనేది ఇది వరకు చాలానే చూశాం. ఇక ఇప్పుడు డైరెక్టర్ బాబీ వంతు వచ్చింది. వెంకీ మామ సినిమతో హిట్ కొట్టేసిన బాబీ.. ఏకంగా మెగా కాంపౌండ్‌లోకి దూరాడు. చిరంజీవితో సినిమాను ఓకే చేయించుకున్నాడు. కథ పదిహేను నిమిషాలు చెప్పగానే ఓకే అనేశాడట చిరు. అలా మొత్తానికి అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ రాబోతోందని చెప్పేశారు.
చిరు బర్త్ డే సందర్బంగా వదిలిన మాస్ పోస్టర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. మళ్లీ ముఠామేస్త్రీలోని చిరంజీవిలా కనిపించాడు. పూనకాలు లోడింగ్ దుమ్ములేపేశాడు. మాస్ మూలవిరాట్ దర్శనం అంటూ నేడు దుమ్ములేపేశాడు. ‘మెగాస్టార్, ఆయన పేరు వింటే.. అంతు లేని ఉత్సాహం ! ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం ! తెర మీద ఆయన కనబడితే…ఒళ్ళు తెలీని పూనకం ! పద్దెనిమిదేళ్ల క్రితం.. ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల.. నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను’ అని బాబీ అన్నాడు.
Our favourite matinee idol, in an avatar we love to see him the most
Presenting the 'Mass Moolavirat' from #Mega154
Inka Mana Annayya Araachakam Aarambham
Megastar @KChiruTweets @dirbobby @ThisIsDSP
pic.twitter.com/qaZaWn49ae — Mythri Movie Makers (@MythriOfficial) November 6, 2021
నేడు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈక్రమంలోనే బాబీ ఇలా ఎమోషనల్ అయ్యాడు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం సినిమాలోని పోస్టర్‌ను విడుదల చేశారు. నిజంగానే మాస్‌ను పీక్స్‌లో చూపించేశాడు బాబీ. సిగరెట్, ఆ లైటర్ పట్టుకున్న తీరు.. జుట్టు, గడ్డం అన్నీ కూడా అదిరిపోయాయి. అన్నయ్య అరాచకం ఆరంభం అంటూ ఈ చిత్రంతో చిరంజీవిని మరో లెవెల్‌లో నిలబెట్టేందుకు బాబీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీస్ భారీ ఎత్తున నిర్మిస్తోంది.