Site icon A2Z ADDA

పర్‌ఫ్యూమ్ మూవీ రివ్యూ

చిన్న చిత్రాల్లో ప్రయోగాలు చేయడం అంటే సాహసమే. అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తోనే పర్‌ఫ్యూమ్ అనే సినిమా వచ్చింది. స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకకెక్కగా.. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ “పర్‌ఫ్యూమ్” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం

కథ
వ్యాస్ (చేనాగ్) స్మెల్లింగ్ అబ్‌సెషన్‌తో సతమతం అవుతుంటాడు. అమ్మాయిల వాసన వస్తే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అయితే ఆ అమ్మాయిలనేమీ గాయపర్చడు. హింసించడు. కేవలం వాసన చూసి ఫీల్ అవుతుంటాడు. ఇలాంటి వాడు సమాజంలో తిరిగితే సైకోలా మారతాడని ఏసీపీ దీప్తి (అభినయ) పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి తరుణంలో లీలా (ప్రాచీ థాకర్) ఆ వ్యాస్‌కి ఓ సారి ముద్దు పెడుతుంది. ఆ తరువాత అమ్మాయి కోసం వ్యాస్ పిచ్చివాడైపోతాడు. లీల వివరాలు కనుక్కుని ఆమె వద్దకు వెళ్తాడు. అందరి ముందు ముద్దు పెడతాడు. దీంతో లీల అతడ్ని కొడుతుంది. దీంతో వ్యాస్ పగతో రగిలిపోతుంటాడు. ఆ తరువాత వ్యాస్ ఏం చేశాడు? లీల మీద ఎలా పగ తీర్చుకున్నాడు? అసలు లీల,వ్యాస్‌ల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చివరకు పోలీసులు వ్యాస్‌ను పట్టుకున్నారా? లేదా? అన్నది కథ.

నటీనటులు
వ్యాస్ పాత్రలో చేనాగ్ చక్కగా నటించాడు. అయితే కొన్ని సార్లు మాత్రం తడబడినట్టుగా కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో కొన్ని చోట్ల ఓకే అనిపిస్తాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో నాచురల్‌గా నటించాడు. లీల కారెక్టర్‌లో ప్రాచీ పర్వాలేదనిపిస్తుంది. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఏసీపీ దీప్తిగా అభినయ కనిపించినంతలో మెప్పించింది. బాబా, తాజ్ పాత్రలు బాగానే ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి.

విశ్లేషణ
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించినప్పుడు జనాలకు కనెక్ట్ అవ్వడం కాస్త కష్టంగానే అవుతుంది. ఆ కాన్సెప్ట్‌కు, చూపించిన ఎమోషన్స్‌కు ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసినప్పుడే దర్శకుడు సక్సెస్ అయినట్టు. ఈ పర్‌ఫ్యూమ్ సినిమాకు ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. హీరో బాధను ఆడియెన్స్ ఫీలయ్యేలా కనిపిస్తోంది. అయితే ఆ ఎమోషన్‌ను బోర్ కొట్టించకుండా తీసుకెళ్లడంతో దర్శకుడు కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ చూసిన తరువాత రెండో భాగం మీద మరింతగా అంచనాలు పెరుగుతాయి. హీరో ఏం చేస్తాడా? అని అంతా అనుకుంటారు. కానీ ఊహకు భిన్నంగా కథనం సాగుతుంది. ద్వితీయార్దంలో హీరో పాత్ర తీరు పూర్తిగా మారుతుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ సీన్ అస్సలు ఊహించలేరు. ఫ్లాష్ బ్యాక్ సీన్లు బాగుంటాయి. హీరోకి ఆ సమస్యకి ఉన్న నేపథ్యాన్ని చక్కగా చూపించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లు బాగున్నాయి.

సాంకేతికంగా చూసుకుంటే.. పాటలు ఓకే అనిపిస్తాయి. మాటలు గుర్తుండిపోతాయి. నగ్న సత్యాలు చెప్పినట్టుగా అనిపిస్తాయి. కెమెరావర్క్ బాగుంది. నిడివి సమస్యగా అనిపించదు. సాంకేతిక విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్టుగా కనిపిస్తుంది.

రేటింగ్ 3

Exit mobile version