Site icon A2Z ADDA

Chiranjeevi నా కాళ్లు పట్టారు : బృందా మాస్టర్

Brindha Master-Chiranjeevi కొరియోగ్రాఫర్స్‌లో లేడీ మాస్టర్లుండటమే చాలా తక్కువ. కానీ ఒకప్పుడు బృందా మాస్టర్ హవా మామూలుగా ఉండేది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని భాషల్లో బృందా మాస్టర్ అదరగొట్టేశారు. ఇక చిరంజీవి వంటి టాప్ హీరోలకు కూడా బృందా మాస్టర్ అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసింది. అయితే చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి బృందా మాస్టర్ చెప్పుకొచ్చింది.

చిరంజీవి సర్ డ్యాన్స్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయనకు ఏ మూమెంట్ ఇచ్చినా కూడా ఇట్టే చేసేసేవారు. ఆయనతో పని చేస్తే.. ఎలాంటి ప్రయోగాలైనా చేయోచ్చు..మనం ఏం చెప్పినా కూడా ఆయన కాదనకుండా డ్యాన్స్ చేసేస్తారు. ఇక హీరోయిన్లు కూడా చిరంజీవి గారితో మూమెంట్స్ అంటే అంతే ఉత్సాహంగా ఉండేవారు.

మూమెంట్స్‌ను హీరోయిన్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవారు. నేను కూడా ఎక్కువగా వారిని ప్రాక్టీస్ చేయమని చెప్పేదాన్ని. అక్కడుంది చిరంజీవి గారు. యాక్షన్ అని చెప్పడంతోనే చేసేస్తారు అని అనేదాన్ని. అలా హీరోయిన్లు కూడా డ్యాన్సులు చేసేవారు. అయితే ఓ సారి చిరంజీవి గారు, నేను, సౌందర్య ఇలా అందరం యూరోప్ వెళ్లాం. అక్కడ విపరీతమైన చలి.

మరీ తక్కువ ఉష్ణోగ్రత ఉంది. అయితే ఇప్పటిలా ఎక్కువ మందిమి వెళ్లేవాళ్లం కాదు. అక్కడ ప్యాకప్ చెప్పిన తరువాత చివరిగా వచ్చేదాన్ని నేనే. క్లాప్ బోర్డ్ వాటిని పట్టుకుని వస్తుండగా.. ఓ సారి అవి కిందపడ్డాయి. చేత్తో తీసుకోలేనంతగా చేతులు గడ్డకట్టాయి. కింద చూస్తేకాళ్లు కూడా అందులోనే ఇరుక్కుపోయాయి. రక్తం కూడా కారింది.

నా కాళ్లను అలా చూసి చిరంజీవి గారు తన మోకాలి మీద పెట్టుకున్ని కాళ్లను పట్టుకుని రుద్దారు. వద్దు సర్ నేను అన్నా కూడా వినలేదు. అంటూ చిరంజీవి గొప్పదనాన్ని బృందా మాస్టర్ చెప్పుకొచ్చింది.

Exit mobile version