దిశా పటాని తన సోదరితో కలిసి గత కొన్ని రోజులుగా చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండటం లేదు. వెకేషన్‌లో భాగంగా దిశా పటాని, తన సోదరి కుష్బూ పటానిలు రచ్చ రచ్చ చేస్తున్నారు. మామూలుగానే దిశా పటానీ అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనుకడుగు వేయదు. ఇక ఇలాంటి వెకేషన్స్ ఉంటే.. పక్కనే అలా రెచ్చగొట్టే వారు ఉంటే అస్సలే ఆగదు. మొత్తానికి దిశా పటాని మాత్రం ఇప్పుడ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంది. తన సోదరి కుష్బూ పటానీ (డుబ్బు) బర్త్ డే వీడియోలు వైరల్ అవుతోన్నాయి.
తనకు ఎంతో ఇష్టమైన సోదరి బర్త్ డే అంటూ దిశా పటానీ కొన్ని పోస్ట్‌లు చేసింది. తన ఇన్ స్టాస్టోరీలో వరుసగా పోస్ట్‌లు పెడుతోంది. అర్దరాత్రి ఎలా ఒళ్లు మరిచి టేబుల్ ఎక్కి చిందులు వేసిందో చూపించింది. చుట్టూ అందరూ ఉన్నారు. టేబుల్ మీదకు ఎక్కింది. పిచ్చిపిచ్చిగా ఎగిరేసింది. బాయ్ ఫ్రెండ్ కూడా పక్కనే ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి దిశా పటానిని మించి పోయేలా ఉంది. ఊపు ఊపేస్తోంది. వయ్యారాల వడ్డన చేస్తూ మైకంలో తేలిపోయింది.
టేబుల్ ఎక్కి డ్యాన్సులు చేస్తుండటంతో దిశా పటానీ కూడా రెడీగా ఉన్నట్టు చెప్పింది. నాక్కూడా అలానే డ్యాన్స్ చేయాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టేసింది. హ్యాపీ బర్త్ డే క్రేజీ సిస్.. నాక్కూడా నీలానే ఇలా డ్యాన్స్ చేయాలని ఉందంటూ వరుసగా వీడియోలను షేర్ చేసింది. మొత్తానికి దిశా పటాని, ఆమె సోదరి కలిసి బర్త్ డే రాత్రి రచ్చ రచ్చ చేశారు. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సోదరి సెలెబ్రేట్ చేసుకున్న ఈ పార్టీలో దిశా పటాని హల్చల్ చేసింది.