బిగ్ బాస్ టీం ఈ సారి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిన వ్యక్తుల్ని తీసుకునేలా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన, కాంట్రవర్సీలతో ఫేమస్ అయిన వ్యక్తుల్నే సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సారి కొత్త కాన్సెప్ట్ తీసుకు వచ్చారు. సామాన్య ప్రజల్ని బిగ్ బాస్ షో ప్రాసెస్‌లోకి తీసుకు వచ్చారు. ఇక బిగ్ బాస్ టీం ఇచ్చిన ఆఫర్లను వాడుకునేందుకు కామన్ మేన్స్ చాలా మంది పోటీ పడ్డారు. కొన్ని లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయి.
అయితే కామన్ మెన్ కెటగిరీల్లో వెళ్లే వారి లిస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. దీని కోసం వడపోత కార్యక్రమం కూడా బిగ్ బాస్ టీం స్టార్ట్ చేసింది. సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్లకు టాస్కులు పెట్టి బిగ్ బాస్ అగ్ని పరీక్షలన్ని పాస్ అయితేనే చివరకు ఇంట్లోకి అడుగు పెడతారట. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షను కేవలం ఓటీటీలోనే చూపిస్తారట. రియల్ షో మొదలైన తరువాతే టీవీల్లోకి వదులుతారని తెలుస్తోంది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సాధారణ జనాలకు టాస్కులు పెట్టి గెలిచిన వాళ్లనే చివరికి కంటెస్టెంట్లుగా ఫిక్స్ చేస్తారట.
ఇప్పటికే కొంత మంది సెలెబ్రిటీలని బిగ్ బాస్ టీం ఫైనల్ చేసిందని సమాచారం. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా ట్రోలింగ్‌తో ఫేమస్ అయిన రమ్యని తీసుకున్నారని తెలుస్తోంది. ఆమె ఎక్స్ పోజింగ్ రీల్ వీడియోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఇక హోటల్స్, పబ్, రెస్టారెంట్లలో గొడవలు పెట్టుకుని వైరల్ అవుతున్న కల్పిక గణేష్ కూడా దాదాపు ఫిక్స్ అయిందని టాక్. త్వరలోనే ఈ లిస్ట్ అధికారికంగా బయటకు రానుంది.