Vj Sunny బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కొంత మంది కంటెస్టెంట్లు నెట్టింట్లో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉన్నారు. అందులో సన్నీ గురించి పాజిటివో, నెగిటివో ఏదో ఒక విషయంలో మాత్రం ట్రెండ్ అవుతూనే ఉంటాడు. అయితే ఈ ఫ్యామిలీ మెంబర్లు వచ్చిన సమయంలో మాత్రం సన్నీ అందరితో కలిసిపోయాడు. సిరి మదర్ వచ్చినప్పుడు ఒక్క సన్నీ మాత్రమే డిఫెండ్ చేశాడు.
సిరి షన్ను రిలేషన్ గురించి సిరి మదర్ చెబుతుండటం, ఆమె బాధను కాస్త తగ్గించేందుకు సన్నీ ముందుకు రావడం, సిరి షన్ను చాలా మంచి ఫ్రెండ్స్.. మంచి వాళ్లు అని ఇలా కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడి వరకు సన్నీ ప్రయత్నం బాగానే ఉంది. ఇక శ్రీరామచంద్ర చెల్లి వచ్చినప్పుడు కూడా ఇలానే కవర్ చేసే ప్రయత్నం చేశాడు
శ్రీరామచంద్ర సింగింగ్‌ను ఎంజాయ్ చేస్తామని అన్నాడు. కానీ అంతకు ముందు ఎన్నో సార్లు సంగీతం మాస్టర్ అంటూ శ్రీరామచంద్రను వెక్కిరించాడు. ఇక సిరి కారెక్టర్ గురించి కూడా మాట్లాడుతూ.. గలీజ్‌ది అంటూ దారుణంగా మాట్లాడేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ మెంబర్ల ముందు షుగర్ కోట్ వేశాడు.
#BiggBossTelugu5#SreeramaChandra mundu dairyamga matlade dammu leni cunny
Family vastane sugar coating matalu.. Sympathy mingatalu
Cunny – the double action serial action
pic.twitter.com/Las4dZ3qQ4 — Professor Puli
(@professorpuli) November 26, 2021
ఇప్పుడు ఆ వీడియోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అప్పుడలా ఇప్పుడలా మాట్లాడాడు అంటూ సన్నీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతమైతే ఇంట్లో అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. తమ ఫ్యామిలీ మెంబర్లను చూడటంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
