Site icon A2Z ADDA

Bigg Boss 5 Unseen : సిరి ఆపుకోలేకపోతోందా?.. ముద్దు పెట్టడంతో షన్ను షాక్

బిగ్ బాస్ ఇంట్లో జరిగేది కొండంత.. చూపించేది గోరంత. బిగ్ బాస్ టీం తమకు నచ్చిన, మెచ్చిన వాటిని మాత్రమే ప్రసారం చేస్తుంటుంది. అలా ఒక్కోసారి కొంత కంటెంట్‌ను చూపించకుండా దాచి పెడుతుంది. వాటిని అన్ సీన్ పేరుతో మళ్లీ ఎపిసోడ్‌లో యాడ్ చేస్తుంటుంది. మొన్న ఓ సారి మెయిన్ ఎపిసోడ్‌లో మానస్ మీద ప్రియాంక పడి పడి ముద్దులు పెడుతుంది. ముద్ద కావాలా? ముద్దులు కావాలా? అని నీచంగా ప్రవర్తిస్తుంటుంది. మానస్ మీద పడి ముద్దులు పెట్టేస్తుంది. అయితే ఆ తరువాత ఆ సీన్‌ను లేపేశారు. ఎపిసోడ్‌లో వెతికితే మళ్లీ కనిపించలేదు. అంటే బిగ్ బాస్ వాళ్లు తమ తప్పును తెలుసుకున్నట్టున్నారు.

అయితే నిన్నటి ఎపిసోడ్‌లోనూ ఇలాంటి ఓ సీన్ జరిగింది. అది అన్ సీన్‌లో ఉంది. సిరి, షన్ను గార్డెన్ ఏరియాలోని బెంచ్ మీద కూర్చుని ఉంటారు. మరో వైపు కాజల్, మానస్, సన్నీలు లంచ్ చేస్తుంటారు. అయితే షన్నుని సడెన్‌గా ముద్దు పెట్టేసుకుంటుంది సిరి. ఆ మధ్య ఒకసారి నుదురు మీద పెట్టింది. ఎందుకు అలా పెట్టావమ్మా అని సుమ అడిగితే.. తల్లిదండ్రులు పెడతారు. కదా? ఆ ఉద్దేశ్యంతో పెట్టాను అని కవర్ చేసింది.క కానీ ఇప్పుడు పెట్టింది నుదురు మీద కాదు.

చెంపకు, చెవికి మధ్యలోని ప్రదేశానికి ముద్దు పెట్టింది. మరి దీనికి ఏ సమాధానం చెబుతుందో చూడాలి. అది అన్ సీన్‌లో ఉంది కాబట్టి ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. అలా మొత్తానికి సిరి ముద్దు పెట్టడంతో కాస్త ఆశ్చర్యం, చిరాకు, కోపం ఇలా అన్ని ఎమోషన్లు ఒకేసారి వచ్చినట్టుగా షన్ను ఓ చూపు చూస్తాడు. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టావ్ అని అడిగితే.. ఏ సమాధానం చెప్పదు సిరి. అసలే చీరకట్టుకుని మంచిగా రెడీ అయి షన్ను పక్కన కూర్చుంది.

అలా ముద్దు పెట్టేసింది. ఎందుకు పెట్టిందో కూడా తెలీదు. షన్ను అడిగినా కూడా చెప్పలేదు. దీంతో కొంత మంది నెటిజన్లు సిరిని దారుణంగా తిడుతున్నారు. ఆపుకోలేకపోతోందా? అని కామెంట్లు పెడుతున్నారు. ఈ సీన్ గనుక ఎపిసోడ్‌లో చూపిస్తే ఎలిమినేట్ అయ్యేది అని అంటున్నారు.

Exit mobile version