Site icon A2Z ADDA

Bigg Boss 5 Day 74 Unseen : ఇంత కంటే దరిద్రం ఏమైనా ఉంటుందా?.. షన్ను సిరి లిప్ లాక్!

బిగ్ బాస్ ఇంట్లో సిరి,షన్నుల ట్రాక్ ఎలా నడుస్తుంది? ఎటు వెళ్తోంది.. ఎక్కడికి దారి తీస్తుందన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. బిగ్ బాస్ ఇంట్లో ఈ సారి సరసాల ఘాటుదనం పెరిగిపోతోంది. గత సీజన్లలో లేనంతగా ఈ సారి ఎక్కువ మోతాదులో వస్తోంది. ఓ వైపు ప్రియాంక చేష్టలు.. మానస్ మీద పడి పడి ముద్దులపెట్టడమే ఓ ఛండాలం అని అనుకుంటే.. ఇక సిరి షన్నులు అంతకంటే నీచంగా ప్రవర్తిస్తున్నారు. వారిది ఫ్రెండ్ షిప్పా? అని అనుకుందామంటే ఆ చేష్టలు మాత్రం అలా లేవు.

ఇప్పటికి షన్నుకి కొన్ని వందల సార్లు ఐ లవ్యూలు చెప్పింది. కానీ షన్ను మాత్రం ఒక్కసారి కూడా చెప్పలేదు. అయినా సరే సిరి మాత్రం షన్నుని వదిలిపెట్టడం లేదు. షన్ను వెనకాల తిరుగుతుంది. షన్నుని హత్తుకుని చంపేసేలా ఉంది. సిరిని ఒక్కోసారి దూరం పెట్టినట్టే అనిపిస్తుంది. మళ్లీ అంతలోనే దగ్గరికి తీసుకుంటాడు షన్ను. అసలు వీళ్ల గోల ఏంటి ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎందుకు అలుగుతారు? ఎందుకు గొడవ పడతారు? అన్నది బిగ్ బాస్ ఎడిటర్లకైనా తెలుస్తోందో లేదో.

నిన్నటి ఎపిసోడ్‌లోనూ సిరి, షన్నుల మూడ్స్ స్వింగ్ అయ్యాయి. ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉన్నారు. వీరి గొడవ ఎక్కడ మొదలైంది.? ఎందుకు మొదలైంది?అన్నది తెలియడం లేదు. అయితే ఐ హేట్ యూ అని షన్ను మొహాన పడేసింది సిరి. ఒకే బెడ్డు మీద పడుకోవద్దు అని చెప్పినందుకు ఈ గొడవలు జరిగాయా? లేదా టాస్కులో ఏమైనా జరిగిందా? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే నిన్న జరిగిన ఓ సీన్ మరింత హైలైటె.

బెడ్డు మీద ఇద్దరూ కూర్చున్నారు. సిరికి షన్ను సారి చెప్పాడు. సిరిని గట్టిగా హగ్ చేసుకున్నాడు షన్ను. ఆ తరువాత తిరిగి హగ్ చేసుకునే ప్రయత్నం చేసింది సిరి. ఈక్రమంలో షన్నుకి లిప్ లాక్ ఇచ్చేసింది. నిన్న ఎపిసోడ్ ప్రసారమయ్యే క్షణంలో ఒక్క సెకను పాటు అది బ్లర్ చేశారు బిగ్ బాస్ ఎడిటర్లు.

కానీ తాజాగా అన్ సీన్లో మాత్రం క్లియర్‌గా చూపించారు. షన్నుని సిరి లిప్ లాక్ పెట్టుకున్నట్టు కనిపించింది. దీంతో షన్ను కాస్త అవాక్కయ్యాడు. అయితే అది కావాలని పెట్టిన లిప్ లాకా? లేక సడెన్‌గా అలా అనుకోకుండా జరిగిన ముద్దు యవ్వారమా?అన్నది తెలియడం లేదు. మొత్తానికి బిగ్ బాస్ షోలో దరిద్రమైన సన్నివేశాలు జరుగుతున్నాయి.

Exit mobile version