Anchor Ravi-Nitya Saxena యాంకర్ రవి ఎలిమినేషన్ అన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే ఇది పక్కా ప్లాన్ అని, కావాలనే రవిని పంపిస్తున్నారంటూ కొందరు.. లేదు రవినే కావాలని వెళ్లిపోతోన్నాడంటూ ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన మాటలు వాళ్లు మాట్లాడుతున్నారు. అయితే రవి ఎలిమినేట్ అవ్వడానికి ఇప్పుడు ఒక్క కారణం కూడా కనిపించడం లేదు.
రవి కంటే కాజల్, ప్రియాంక, సిరిలకు ఓట్లు ఎక్కువగా ఎలా వస్తాయి.. అలాంటి సమస్యే లేదు. ఆ ముగ్గురి కంటే రవికే ఎక్కువ ఓట్లు వచ్చాయని, ప్రియాంక ఎలిమినేట్ కావాల్సింది. రవిని ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ రవి అభిమానులు దారుణంగా రెచ్చిపోతోన్నారు. బిగ్ బాస్ చూసే సాధారణ ప్రేక్షకుడికి సైతం ఇది మింగుడు పడటం లేదు. యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడం ఏంటని షాక్ అవుతున్నారు.
యాంకర్ రవి ఎలిమినేషన్‌ను ఇప్పటికే కొంత మంది నమ్మడం లేదు. లీకులే కదా? వచ్చాయి.. ఇంకా ఎపిసోడ్ పూర్తవ్వలేదు కదా? అని అనుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ ఇంటి నుంచి రవి బయటకు వచ్చేశాడని తెలుస్తోంది. అందుకే నిత్య ఓ కామెంట్ పెట్టేసింది. సహజంగా మనవాళ్లు ఓ డైలాగ్ వాడుతుంటారు. గెలిస్తే గెలిచాడు అని లేదంటే.. ప్రజల హృదయాలను గెలిచారు అని రాస్తుంటారు.
అలానే నిత్య ఇప్పుడు యాంకర్ రవి ఎలిమినేషన్ మీద పరోక్షంగా స్పందించింది. వియా రాసి ముద్దు ముద్దు అక్షరాలను షేర్ చేసింది. ఐ లవ్యూ మమ్మా.. డాడీ విన్ అంటూ వియా రాస్తే.. అవును బేటా.. ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు అంటూ యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్టు పరోక్షంగా ప్రకటించేసింది.
ఇక రవి ఎలిమినేషన్ మాత్రం కచ్చితంగా సరైన నిర్ణయం కాదు అని ప్రియాంక, సిరి నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సింది.. కానీ రవిని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారంటూ నిత్య పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మీకు మేం ఉన్నామంటూ భరోసానిస్తున్నారు.
