Site icon A2Z ADDA

Bigg Boss 5 Telugu : డాక్టర్ బాబు మద్దతు వారికే.. ఓట్లు వేయమన్న నిరుపమ్

కార్తీకదీపం సీరియల్‌తో డాక్టర్ బాబుగా నిరుపమ్‌ పరిటాలకు స్టార్ స్టేటస్ వచ్చేసింది. బుల్లితెర సూపర్ స్టార్, శోభన్ బాబు వంటి ట్యాగులతో నిరుపమ్‌ను పిలుస్తుంటారు. నిరుపమ్ పరిటాలకు సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. డాక్టర్ బాబు ఎన్ని రకాల ట్రోల్స్,మీమ్స్ వస్తుంటాయో అందరికీ తెలిసిందే. మన డాక్టర్ బాబు ఒక్క రోజైనా హాస్పిటల్‌కు వెళ్లాడా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తుంటారు. తన మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్‌ను నిరుపమ్ ఎంతో సరదాగా తీసుకుంటాడు.

అయితే డాక్టర్ బాబు మాత్రం అన్నింటిని ఫాలో అవుతుంటాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాడు. తాజాగా డాక్టర్ బాబు బిగ్ బాస్ షో మీద స్పందించాడు. బిగ్ బాస్ ఇంట్లో తనకు ఇష్టమైన వాళ్లకు మద్దతు ఇవ్వమని, ఓట్లు వేయమని చెప్పేశాడు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రాం స్టోరీ కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలను, ఫోన్ నంబర్లను, హాట్ స్టార్ లింక్‌ను షేర్ చేశాడు. అందులో ఏ ఏ కంటెస్టెంట్ ఉన్నారో ఓ సారి చూద్దాం.

డాక్టర్ బాబు తాజాగా రవి, సన్నీలకు మద్దతు ఇచ్చాడు. వారికి ఓటు వేయమంటూ తన ఫాలోవర్లకు చెప్పేశాడు. ఈ మేరకు రవి, సన్నీలకు ఓటు వేయాలంటే ఫోన్ చేయాల్సిన నంబర్లు, హాట్ స్టార్ లింక్‌ను షేర్ చేశాడు. అసలే ఈవారం మంచి రసవత్తరంగా ఉండేట్టు కనిపిస్తోంది. రవి, మానస్, సన్నీ, కాజల్, సిరి ఇలా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే నామినేషన్లోకి వచ్చారు. దీంతో ఎవరు బయటకు వెళ్తారా? అన్న ఆసక్తి అందిరిలోనూ పెరిగిపోతోంది. మరో వైపు జెస్సీ పరిస్థితి చూస్తుంటే అతడిని బయటకు పంపించేసి.. ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పేసేలా ఉన్నారు.

Exit mobile version