Site icon A2Z ADDA

Bigg Boss 5 Telugu : షన్నుకి హింట్ ఇచ్చిన వీడియో వైరల్.. నోరు విప్పిన దీప్తి సునయన

Deepthi Sunaina Shanmukh Jaswanth బిగ్ బాస్ ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలే బయట చూసే జనాలకు పెద్దగా కనిపిస్తాయి. అందులో నిజానిజాలు ఎంత అనేది లోపల ఉన్న వాళ్లకే తెలుస్తుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో దీప్తి సునయన వచ్చిన తీరు.. షన్నుతో మాట్లాడిన తీరు అందరినీ మెప్పించింది. అయితే ఆమె పదే పదే చేతులతో పట్టుకున్న తీరు మాత్రం అందరిలోనూ అనుమానాలను రేకెత్తించింది.

షన్నుకి ప్రస్తుతం బయట ఉన్న పొజిషన్ గురించి హింట్ ఇచ్చినట్టు అనిపించింది. మైక్ పట్టుకున్న తీరు.. ఆ వేలును పదే కిందికి పైకి ఆడించడంతో షన్నుకి సిగ్నల్ ఇచ్చినట్టు అనిపించింది. ఈ మేరకు నెటిజన్లు కూడా దీప్తి వీడియో మీద చాలా శ్రద్ద పెట్టి చూసినట్టున్నారు. దీంతో ఆమె షన్నుకి హింట్ ఇచ్చేసిందని అంతా ఫిక్స్ అయిపోయారు. దీనిపై ట్రోలింగ్ కూడా మొదలైంది.

చివరకు ఆ వీడియో, ఈ ట్రోలింగ్ అన్నీ కూడా దీప్తి సునయన కంటపడింది. అందరి మదిలో ఉన్న ఆలోచనలు, అనుమానాలకు దీప్తి సునయన బదులిచ్చింది. అందరి అనుమానాలను పటాపంచెలు చేసింది. మీ బొంద రా మీ బొంద.. అలాంటి చీప్ ట్రిక్స్ నేను ఎప్పటికీ చేయను.. షన్ను మ్యాటర్‌లోనే కాదు.. నా లైఫ్‌లోనే చేయను అని ఖరాఖండీగా కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పేసింది.

నువ్ ఎప్పటికీ నాకు నెంబర్ వన్ అని షన్ను గురించి దీప్తి సునయన చెప్పడం.. నువ్ ఇప్పుడే బయటకు రాకు అని దీప్తి.. నేను రాను అది నాకు తెలుసు.. నువ్ ఉన్నావ్ కదా? అంతా చూసుకుంటావ్ అని షన్ను అనడంతో మరో అనుమానం అందరిలోనూ మెదిలింది. బయట దీప్తి సునయన, పీఆర్ టీంతో బాగానే లాక్కొస్తున్నాడంటూ మరొ కొత్త వాదనను పైకి తీసుకొస్తున్నారు.

Exit mobile version