Site icon A2Z ADDA

బిగ్ బాస్ మూడో వారం నామినేషన్ లిస్ట్.. ఈ సారి డేంజర్‌లో ఎవరున్నారంటే?

బిగ్ బాస్ ఇంట్లో రెండు వారాలు గడిచాయి. బేబక్క, శేఖర్ బాషాల ఎలిమినేషన్లు జరిగాయి. ఇక మూడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా జరిగిపోయింది. నబీల్, నిఖిల్, సోనియా, ఆదిత్యలు తప్పా మిగిలిన వారంతా కూడా నామినేషన్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నామినేషన్స్‌లో కంటెస్టెంట్ల మధ్య బాగానే గొడవలు జరిగినట్టుగా కనిపిస్తోంది.

క్లాన్స్ అధినేతలు అయిన నిఖిల్, అభయ్‌లో ఎవరో ఒకరు సేఫ్ కావాలి.. మిగిలిన వారు నామినేట్ అవ్వడం అనే కాన్సెప్ట్ పెట్టాడు. దీంతో నిఖిల్ సేఫ్ అయ్యాడు.. అభయ్ నామినేషన్లోకి వచ్చాడు. అలా ఎందుకు జరిగింది? అనేది ఎపిసోడ్‌లోనే చూడాలి. ఇక ప్రేరణ అయితే సోనియా మీద పీకల్లోతు కోపంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే వారం ఆమెను నామినేట్ చేస్తాను అని యష్మీ చెబుతోంది.

ఇక ఈ వారం విష్ణు ప్రియ, యష్మీ, ప్రేరణ, అభయ్, పృథ్వీ, మణికంఠ, నైనిక, సీత ఇలా అందరూ నామినేషన్లోకి వచ్చారు. అయితే ఈ సారి డేంజర్ జోన్‌లోకి మాత్రం విష్ణు ప్రియ, నైనికలు రారనిపిస్తోంది. సీత సైతం స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. పృథ్వీని చివరి వరకు ఉండనిస్తారు. మణికంఠ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతున్నారు. అభయ్ ఇంత వరకు నామినేషన్లోకి రాలేదు. దీంతో అసలు అగ్ని పరీక్ష ఇప్పుడే స్టార్ట్ అయ్యేలా ఉంది.

 

Exit mobile version