Site icon A2Z ADDA

Bigg Boss 5 Telugu : ఈ వారం జరిగేది ఇదేనా?.. అయితే ఓట్లు వేసే వాళ్లు బక్రాలే!

బిగ్ బాస్ ఇంట్లో తుది నిర్ణయం ఎవరిదో అందరికీ తెలిసిందే. ఆడియన్స్ ఓట్ల ప్రకారమే అంతా జరుగుతుందని అంటుంటారు. పైకి అలా కలరింగ్ ఇస్తారు కానీ లోలోపల జరిగేదంతా కూడా వేరే. ఎందుకంటే కొన్ని సార్లు ఓట్లు తక్కువ వచ్చిన కంటెస్టెంట్లను కావాలనే సేవ్ చేస్తుంటారు. ఈ మేరకు బిగ్ బాస్ ఓటింగ్ సిస్టం మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. బిగ్ బాస్ టీం నిర్ణయించినట్టుగానే ఎలిమినేషన్లు దాదాపు జరుగుతుంటాయి. అయితే ఈ వారం మాత్రం అందరికీ ఓ షాక్ ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.

ఇంట్లో ఉన్నదే పదిమంది. అందులో ఐదు గురు నామినేషన్లోకి వచ్చారు. ఈ సారి వచ్చిన ఐదుగురు మంచి ఫైర్, ఇమేజ్, క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లే. సిరి, కాజల్, రవి, మానస్, సన్నీల్లోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారంటే చెప్పడం కష్టమే. అయితే కాజల్, సిరిలపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోందనిపిస్తోంది. కానీ అసలే ఆడవాళ్లు లేక ఇళ్లంతా మరీ చప్పగా తయారువుతోందంటే.. ఇక మళ్లీ ఆడవాళ్లనే బయటకు పంపుతాడా? అన్నది చూడాలి.

అసలే ఈ సారి ట్రాకులు సరిగ్గా వర్కవుట్ అవ్వడం లేదు. మానస్ ప్రియాంక ట్రాక్‌ను జనాలు చీ కొడుతున్నారు. అస్సలు జీర్ణించుకోలేకపోతోన్నారు. ఇక సిరి, షన్ను ట్రై చేస్తున్నా కూడా వర్కవుట్ అవ్వడం లేదు. ఎందుకంటే బయట వాళ్లకు ఆల్రెడీ ఉన్నారు. అలా మొత్తానికి ఈ సీజన్ ఈ విషయంలో దారుణంగా ఫ్లాప్ అయింది అలాంటిప్పుడు ఇంకా ఉన్న ఆడవాళ్లను కూడా ఇప్పుడు పంపించేస్తే ఇక మొత్తానికే రేటింగ్లు కూడా రాకపోవచ్చు.

కాజల్ కాస్త ఇరిటేటింగ్ అయినా కూడా ఆటలో ఉండాల్సిందే. ఇక సిరి బిగ్ బాస్ ఇంటికి ఏకైక గ్లామరస్ కంటెస్టెంట్. ఆమెను చివరి వరకు ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. అయితే మానస్, సన్నీ, రవి జోలికి ఇప్పుడే వెళ్లరు. అయితే ఈ సారి ఎలిమినేషన్ పరిస్థితి ఏంటి? అంటే ఓ దారి దొరికేసింది బిగ్ బాస్ టీం జెస్సీ రూపంలో. జెస్సీకి అసలే ఆరోగ్యం బాగా లేదు. తాజాగా వదిలిన ప్రోమోను చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నామని చెబుతున్నారు.

కానీ అలా జరగదు. మధ్యలో అలా పంపించలేదు. వీకెండ్ వరకు ఉంచి.. ఈ వారం ఎలిమినేషన్ లేదు.. జెస్సీని పంపించేస్తున్నాం.. ఆరోగ్యం బాగా లేదు అనే కారణాలు చెబుతున్నారు. అచ్చం గత సీజన్లో నోయల్‌, గంగవ్వలకు జరిగినట్టుగా. అయితే అలా జెస్సీని బలి చేసి మిగతా వారిని కాపాడేస్తారు. కానీ ఓట్లు వేసే జనాలను మాత్రం బక్రాలను చేసేస్తారా? ఈ వారం అసలు ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version