Site icon A2Z ADDA

Bigg Boss 5 Telugu : జెస్సీ బయటకు.. మధ్యలో అలా.. ట్విస్ట్‌ల మీద ట్విస్టులు!

బిగ్ బాస్ ఇంట్లో పదో వారం అదిరిపోయేలా ఉంది. మొత్తానికి ఇంట్లో తొమ్మిది వారాలు గడిచిపోయాయి. తొమ్మిది మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఇక ఇంట్లో పది మందే ఉన్నారు. ఈ పదో వారంలో ఎంత మంది నామినేషన్లోకి వస్తారు? అసలు నామినేషన్ ప్రాసెస్ ఏంటి? అన్నది సంగతి చూడాలి. అయితే ఇందులో కెప్టెన్ అయిన ఆనీ మాస్టర్‌కు అసలు అగ్ని పరీక్ష ఎదురు కాబోయేలా ఉంది. ఓ నలుగురు కంటెస్టెంట్లను జైల్లో వేసేయండని బిగ్ బాస్ ఆదేశించాడు.

అందులో కాజల్, సన్నీ, మానస్, షన్ను ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే వారు నేరుగా నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటిస్తాడేమో చూడాలి. ఇందులో రకరకాల ట్విస్టులు రాబోతోన్నట్టు లీకులు అందుతున్నాయి. నేటి ఎపిసోడ్ అద్భుతంగా ఎన్నో మలుపులతో ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ పదో వారంలో రవి, మానస్, సన్నీ, కాజల్, సిరిలు నామినేట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ రాబోతోందని తెలుస్తోంది.

జెస్సీని ఇంట్లోంచి బయటకు పంపించేశారట. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడని ఇంట్లోంచి బయటకు పంపించారని, అయితే సీక్రెట్ రూంలోకి జెస్సీని పంపించారని తెలుస్తోంది. మొత్తానికి ఇంటి సభ్యులకు మరో షాక్ తగలనుంది. అయితే జెస్సీకి దొరికిన ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటాడో లేదో అన్నది చూడాలి. మొత్తానికి ఈ సారి నామినేషన్ లిస్ట్ చాలా టఫ్‌‌గా ఉంది. రవి, మానస్, సన్నీ అయితే ఎలిమినేట్ అయ్యే ప్రసక్తే లేదు. ఇక సిరి, కాజల్ నుంచి ఎవరో ఒకరు బయటకు రావాల్సిందే.

Exit mobile version