Site icon A2Z ADDA

Bigg Boss 5 Telugu : ఆనీ మాస్టర్ రంగులు బయటపడ్డాయ్.. కమల్ హాసన్ అంటూ ట్రోల్స్

బిగ్ బాస్ ఇంట్లో తాను సింగిల్, తాను సింగిల్‌గా ఆడతాను.. ఎవ్వరి సపోర్ట్ నాకు లేదు.. ఇవ్వలేదు.. అంటూ ఇన్ని రోజులుగా ఎన్నో మాటలు అనేసింది. కానీ చివరకు ఆనీ మాస్టర్ రంగులన్నీ బయటపడ్డాయి. ఒక్కోసారి ఒక్కో మాట అనేస్తుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను నామినేట్ చేస్తాను అంటుంది. స్ట్రాంగ్ ప్లేయర్ చాలా బాగా ఆడుతున్నావ్ అందుకే నిన్ను నామినేట్ చేయను అని మళ్లీ ఆనీ మాస్టరే అంటుంది. ఇలా నిన్నటి ఎపిసోడ్‌తో ఆనీ మాస్టర్ ఘోరంగా ఎక్స్ పోజ్ అయింది.

మానస్, సన్నీ, కాజల్‌లను జైల్లో వేయడంతోనే ఆమె లోపల ఉన్న ఉద్దేశ్యం అర్థమైంది. మొదట షన్నుని నామినేట్ చేయలేను అని చెప్పింది. కానీ చివరకు శ్రీరామచంద్ర, షన్నుల మధ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు షన్నును జైల్లో పడేసింది. అలా ఆనీ మాస్టర్ అప్పటికప్పుడు మాటలు మార్చేసింది. మొత్తానికి ఆనీ మాస్టర్ రంగులన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇంత వరకు తనకు ఒక్క టాస్కులో కూడా వాళ్లు సాయం చేయలేదు అని చెప్పుకొచ్చింది ఆనీ మాస్టర్.

సింగిల్‌గా గేమ్ ఆడుతున్నాను.. సింగిల్‌గా ఉంటున్నాను అని చెప్పి.. మళ్లీ ఎవ్వరూ సాయం చేయలేదు అని ఎందుకు చెబుతుందో ఆమెకే తెలియాలి. కంటిన్యూగా నామినేట్ అవుతున్నాడంటూ రవిని, తనకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడంటూ శ్రీరామచంద్రను నామినేట్ చేయలేదు ఆనీ మాస్టర్.

ఆనీ మాస్టర్ పర్ఫామెన్స్‌ను చూసి కమల్ హాసన్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేసి పడేస్తున్నారు. రకరకాల మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. మొత్తానికి ఆనీ దెబ్బకు కాజల్ కూడా నామినేషన్లోకి వచ్చేసింది. అలా ఈ వారంలో రవి, సిరి, మానస్, సన్నీ, కాజల్‌లోంచి ఎవరో ఒకరు బయటకు రావాల్సిందే. కాజల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Exit mobile version