Anchor Ravi Shanmukh Jaswanth బిగ్ బాస్ షో ద్వారా షన్ను, రవి చాలానే క్లోజ్ అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో రవిని ఎప్పుడూ టార్గెట్ చేస్తుండే వాడు షన్ను. ఇంఫ్లూయెన్స్ చేస్తాడంటూ షన్ను ప్రతీ సారి విలన్ ట్యాగ్ ఇచ్చేవాడు. అయినా కూడా రవి మాత్రం షన్నుని తమ్ముడిలా చూసుకునే వాడు. రవి ఎలిమినేట్ అయ్యాక షన్ను, సిరి చాలా బాధపడ్డారు. కానీ నామినేట్ చేసింది మాత్రం మళ్లీ ఆ ఇద్దరే.
అలా షన్ను, రవి రిలేషన్ బాగానే పాపులర్ అయింది. అన్నదమ్ములు అంటూ ఇద్దరూ బాగానే కనెక్ట్ అయ్యారు. కానీ బయటకు వచ్చిన తరువాత మాత్రం ఈ ఇద్దరూ ఇంకా కలుసుకోనేలేదు. కానీ ఇన్ స్టాగ్రాంలో మాత్రం తమ స్టోరీలను షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న మెమోరీస్‌ను తలుచుకుంటూ బ్రదర్ హుడ్‌ను తలుచుకుంటారు.
తాజాగా యాంకర్ రవి తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ఇందులో ఒక్కో నెటిజన్ ఒక్కో రకమైన ప్రశ్నను సంధించారు. అందులో ఓ నెటిజన్ మాత్రం షన్ను గురించి అడిగాడు. షన్నుని కలిశావా? అన్నా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి యాంకర్ రవి ఆసక్తికరమైన సమాధానాన్ని ఇచ్చాడు.
షన్ను ఇంత బిజీగా అవ్వడం సంతోషంగా ఉంది.. ఈ ఏడాది మొత్తంలో ఒక్క క్షణం అయినా టైం ఇస్తాడేమో చూడాలి అని రవి అన్నాడు. అంటే షన్ను ఈ ఏడాది అంతా ఫుల్ బిజీగానే ఉండబోతోన్నాడు అని హింట్ ఇచ్చేశాడు. ఇప్పటికే షన్ను యూట్యూబ్ కోసం ఓ వెబ్ సిరీస్‌ను ప్రారంభించేసిన సంగతి తెలిసిందే.
