Site icon A2Z ADDA

Bigg Boss 5 Telugu : యాంకర్ రవి నిజమైన యోధుడు!

యాంకర్ రవి బిగ్ బాస్ ఇంట్లో శారీరకంగా ఎక్కువగా కష్టపడటం లేదనే అపవాదు ఉంది. మెంటల్‌గా, మానసికంగా, అందరినీ ప్రభావితం చేస్తూ పబ్బం గడుపుతున్నాడని అంతా అనుకున్నారు. ఒక్క టాస్కులో కూడా రవి శారీరకంగా బలాన్ని ఉపయోగించి గెలవలేకపోయాడు. సిరి చేతిలో కూడా రవి ఓడిపోయాడు. అలా మొత్తానికి రవి మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అందరి నోళ్లు మూయించాడు. నిన్నటి టాస్క్‌లో రవి చివరి వరకు నిలబడ్డాడు.

సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అంటూ ఇచ్చిన టాస్క్‌లో రవి దుమ్ములేపేశాడు. సూపర్ విలన్స్ టీంలో రవి ఉన్నాడు. అయితే రవిని ఓడ గొట్టేందుకు హీరోస్ టీం తెగ కష్టపడింది. కాజల్, శ్రీరామచంద్ర, మానస్, షన్ను ఇలా అందరూ కలిసి రవిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. బట్టలకు పేడను పూయించారు. ఒంటికి పేడ పూయించారు. పేడతో స్నానం చేయమన్నారు.. ఇలా ఎన్ని టాస్కులు ఇచ్చినా కూడా చివరి వరకు నిలబడ్డాడు రవి.

అయితే రవికి వెన్ను నొప్పి ఉందని తెలిసినా కూడా అలాంటి శారీరకమైన టాస్కులే ఇచ్చారు. డంబెల్స్‌తో సిట్ అప్స్ చేయమన్నారు. బ్యాక్ మీద ఎక్కువ భారం పడుతుందని తెలిసినా కూడా అలాంటి టాస్కులే ఇవ్వడంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా రవి వెనుకడుగు వేయలేదు. చివరి వరకు నిలబడ్డాడు. గెలిచాడు. నాలుగు రకాల వింత జ్యూసులు ఇచ్చినా కూడా రవి మొత్తం తాగేశాడు. ఆ టాస్కుల్లో గెలిచాడు. మొత్తానికి రవికి నిన్నటి ఎపిసోడ్‌తో మంచి ఇమేజ్ వచ్చింది.

 

FacebookWhatsAppTwitter
Exit mobile version