Site icon A2Z ADDA

Bigg Boss 5 Telugu : సీక్రెట్ టాస్కులో బొక్కబోర్లా.. మొత్తానికి కెప్టెన్‌ అయిన యాంకర్ రవి

బిగ్ బాస్ ఇంట్లో రవి పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇంట్లో ఎవ్వరేం చేసినా సరే అతడినే అనుమానించేస్తున్నారు. అతని చేష్టలు కూడా అలానే ఉన్నాయనుకోండి. అసలే అందరూ అనుమానపడే కంటెస్టెంట్‌కు ఇక సీక్రెట్ టాస్క్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవి చేస్తోన్న చేష్టలను పట్టి అందరూ కనిపెట్టేశారు. కానీ చివరకు రవినే కెప్టెన్‌గా ఎన్నికయ్యాడని తెలుస్తోంది. అలా మొత్తానికి రవి చిరకాల వాంచ నెరవేరింది.

బీబీ హోటల్ టాస్క్‌లో రవి నానా కష్టాలు పడుతున్నాడు. కాజల్ డబ్బును దొంగిలించాడు. కాజల్ కన్ను అంతా కూడా రవి మీదే ఉంది. రవియే దొంగతనం చేసి ఉంటాడని బలంగా నమ్ముతోంది. ఇక షన్ను మరో వైపు ఆ దొంగతనాన్ని చూశాడు. అదే విషయాన్ని రవికి చెబితే బుకాయించాడు. కానీ అక్కడా కూడా ఫెయిల్ అయ్యాడు. ఇక ఆనీ మాస్టర్ విషయంలోనూ మాట మార్చేందుకు ట్రై చేశాడు. వేడి నీళ్లు కావాలనే పోశావా? అంటూ మాట మార్చి తగువులు పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది కూడా వర్కవుట్ అవ్వడం లేదు.

రెస్టారెంట్ స్టాఫ్ ఇచ్చే సేవలను నాశనం చేసేందుకు రవి తెగ కష్టపడుతున్నాడు. నీళ్లలో కారం కలిపాడు. కాజల్ తాగింది. రవి మీదే అనుమానం వచ్చింది. చివరకు రవితోనే ఆ వాటర్ తాగించింది. అలా ప్రతీ సారి బొక్క బోర్లా పడుతున్నాడు. కానీ చివరకు రవినే కెప్టెన్ అయ్యాడని తెలుస్తోంది. నేటి ఎపిసోడ్‌లో బీబీ హోటల్ టాస్క్ ముగిసిపోనుంది. కెప్టెన్సీ కంటెండర్‌గా ఎలాంటి టాస్క్ ఇస్తారో.. రవి ఎలా కెప్టెన్ అయ్యాడో చూడాలి మరి.

 

Exit mobile version