బిగ్ బాస్ ఇంట్లో యష్మీ తనని తాను ఏదో పెద్దగా ఊహించుకుంటోంది. చీఫ్ అయ్యే సరికి యష్మీకి కళ్లు నెత్తికి ఎక్కినట్టుగా అనిపిస్తుంది. రెండు వారాలు నామినేషన్లోకి రాకపోయే సరికి మరింత కాన్ఫిడెన్స్ పెరిగినట్టుగా ఉంది. ఒక్కసారి యష్మీ నామినేషన్లోకి వస్తే ఏం జరుగుతుందో ఆమెకు తెలియడం లేదు. ఇప్పటికే జనాలు ఆమె మీద పీకల దాక కోపంతో ఉన్నారు. ఆమె చేసే పనులకు చిర్రెత్తి పోయి ఉన్నారు. పిచ్చి పిచ్చిగా గెంతులు వేస్తూ, తన టీంతో కలిసి బిచింగ్ చేస్తూ ఉంటుంది.
చికెన్ దొంగతనం చేసి మరీ విష్ణుప్రియతో ఫ్రూప్ ఉందా? అంటూ వాగ్వాదం పెట్టుకుంటుంది. ఇక మణికంఠ, సీతలు టాస్కులు ఆడితే..సంచాలక్‌గా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి.. ఏదో మదర్ థెరిస్సా అయినట్టు.. ఐదుగుర్ని ఖాళీ కడుపుతో ఉంచడం ఇష్టం లేక అలా నిర్ణయం తీసుకున్నట్టు అని కవర్ చేసుకుంది. పావు కిలోకి ఏది దగ్గర్లో ఉంటే అది తీసుకుంటా అని చెప్పి.. మళ్లీ మర్చిపోయి.. ఆ టాస్కులో మణికంఠని కాకుండా సీతని గెలిచిపించింది. అక్కడ తన నిర్ణయమే ఫైనల్ అని పెద్ద ఎక్స్ ట్రాలు చేసింది సంచాలక్‌గా యష్మీ ఓడింది.
ఇదే విషయాన్ని నాగార్జున అడిగితే.. ఒకలా చెప్పింది. వీడియో వేసి చూపించిన తరువాత మొసలి కన్నీరు కార్చింది. వెయిట్‌కి ఏది దగ్గరగా ఉంటే అది ఇస్తానని చెప్పిన మాటల గుర్తు లేదని కవర్ చేసింది. ఐదు మంది పస్తులు ఉంటారనే ఉద్దేశంలో అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చింది.
కానీ ఇలాంటి కాకమ్మ కబుర్లు జనాలు నమ్మరని ఆమెకు తెలియదు. ఇక యష్మీ మీద కూడా జనాల్లో విపరీతమైన నెగెటివిటీ పెరిగిపోయింది. చూస్తుంటే ఈ మూడో వారంలో ఆమెను బయటకు పంపేలా కనిపిస్తున్నారు. కానీ యష్మీ, సోనియా ఇలా అంతా కూడా బిగ్ బాస్ ముద్దు బిడ్డల్లా అనిపిస్తున్నారు. ఏదో ఒకలా చివరి వరకు వాళ్లని ఇంట్లో ఉంచేసుకునేలా ఉన్నారు.