Site icon A2Z ADDA

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ రెండో వారం ఎలిమినేషన్.. బలి చేస్తారా?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ రెండో వారం ఎలిమినేషన్ మీద అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరు ఎలిమినేట్ అవుతారా? అని అంతా ఎదురుచూస్తున్నారు. అయిత ఈ రెండో వారంలో మాత్రం సీత డేంజర్ జోన్‌లో ఉందన్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే మొదటి రెండు మూడు వారాలు లేడీ కంటెస్టెంట్లు ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతుంటారు. అన్ని సీజన్లలో అదే జరుగుతూ వచ్చింది. అయితే ఈ సారి కూడా అదే సెంటిమెంట్ చూసుకుంటే సీత ఎలిమినేట్ కావాల్సిందే.

 

కానీ ఇక్కడ సమీకరణాలు మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది మగ కంటెస్టెంట్ అని అర్థం అవుతోంది. ఈ వారం టాస్కుల్లో అయినా, నార్మల్ విషయాల్లో అయినా శేఖర్ బాషా, ఆదిత్య ఓంల పర్ఫామెన్స్ అంతగా కనిపించలేదు. పృథ్వీ అంతో ఇంతో కనిపించాడు. విష్ణు ప్రియకు ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా ఇప్పట్లో ఎలిమినేట్ కాదు. ఆమెను బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడు.

అలా లెక్కలన్నీ పరిశీలిస్తే ఈ సారి ముప్పు మాత్రం ఆదిత్య, శేఖర్‌లకు ఎక్కువగా ఉంది. శేఖర్ బాషా, ఆదిత్యల్లోంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనిపిస్తోంది. ఆదిత్య అయితే బొత్తిగా ఎక్కడా కనిపించడం లేదు. టాస్కుల్లో కూడా ఆయన ప్రమేయం శూన్యం. ఆయన వల్ల బిగ్ బాస్ ఇంటికి ఎలాంటి ఎంటర్టైన్మెంట్, ఉపయోగం కూడా లేదు. అందుకే ఆదిత్యను బలి చేయాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. శేఖర్ బాషాకి కూడా తక్కువ ఓట్లే వచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి ఈ రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? అసలేం జరుగుతోందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

 

రెండో వారంలో టాస్కులు ఎంత చెత్తగా జరిగాయో.. ఎంత నీరసంగా ఎపిసోడ్‌లు సాగాయో అందరికీ తెలిసిందే.ఈ వారం కూడా సోనియా తన ద్వేషాన్ని, కుళ్లుని చూపెట్టింది. విష్ణు ప్రియని ఎప్పుడూ ఏదో రకంగా కిందకు దించాలని, తక్కువ చేయాలనే చూస్తూ వచ్చింది. సోనియా వల్లే విష్ణు ప్రియకు ఓటింగ్ మరింతగా పెరుగుతోంది. సోనియా ద్వేషమే.. విష్ణుప్రియకి కలిసి వస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో ఇలా కంటిన్యూగా ఓ కంటెస్టెంట్ మీద ద్వేషాన్ని చూపుతూ ఉంటే ఏం అవుతుందో ఇది వరకే చూశాం. మూడో సీజన్లో ఇలానే శ్రీముఖి పదే పదే రాహుల్ సిప్లిగంజ్‌ను టార్గెట్ చేస్తూ వచ్చింది. చివరకు జీరో నుంచి హీరోగా ఎదిగి.. బిగ్ బాస్ టైటిల్, కప్పు కొట్టుకు పోయాడు రాహుల్ సిప్లిగంజ్. ఈ విషయాన్ని సోనియా గ్రహించలేకపోతోంది. ఇక ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

 

Exit mobile version